Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన వసతి కల్పిస్తాం

ABN , Publish Date - Jul 31 , 2026 | 10:40 PM

సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె. హరిత అన్నారు. మండల కేంద్రంలో ఒకే భవనంలో కొనసాగుతున్న ఎస్సీ, బీసీ వసతి గృహాలను శుక్రవారం కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా స్టోర్‌ రూమ్‌, వంటగది, విద్యార్థులు నివసిస్తున్న గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఇతర పరిస్థితులను పరిశీలించారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన వసతి కల్పిస్తాం
:స్టోర్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత

వాంకిడి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కె. హరిత అన్నారు. మండల కేంద్రంలో ఒకే భవనంలో కొనసాగుతున్న ఎస్సీ, బీసీ వసతి గృహాలను శుక్రవారం కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా స్టోర్‌ రూమ్‌, వంటగది, విద్యార్థులు నివసిస్తున్న గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఇతర పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న భోజన, వసతి, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్‌ రూమ్‌, స్లాబ్‌ ఉన్న గదులలో వర్షపునీరు చేరుతున్న విషయాన్ని హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే తగిన చర్యలు చేపట్టి వర్షపు నీరు లోపలికి రాకుండా అవసరమైన మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పారు. ఒకే భవనంలో రెండు వసతిగృహాలు కొనసాగడం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గ్రామంలో అనువైన అద్దె భవనాన్ని గుర్తించాలని సూచించారు. బీసీ వసతి గృహాన్ని అక్కడికి తరలించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యారంగ అభివృద్దికి ప్రభుత్వం ప్రధాన్యత ఇస్తుందని, ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు సకలసదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నాయబ్‌ తహసీల్దార్‌ రామ్‌లాల్‌, బీసీ వసతి గృహ సంక్షేమ అధికారి మధుకర్‌ పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ త్వరగా పూర్తయ్యే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. వందశాతం డిజిటలైజేషన్‌ పూర్తి చేయడంలో రాజకీయ పార్టీలు తమ సహకారం అందించాలని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 90 శాతం ప్రక్రియ పూర్తయిందని వివరిం చారు. గామీణ ప్రాంతా లలో ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని పట్టణ ప్రాంతాలపై పార్టీలు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 10:40 PM