వైద్య రంగంలో జిల్లాను ముందుంచుతాం..
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:26 PM
వైద్య రం గంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్ధానంలో ఉంచేందుకు కృషి చేస్తు న్నామని కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు పేర్కొన్నారు.
కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : వైద్య రం గంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్ధానంలో ఉంచేందుకు కృషి చేస్తు న్నామని కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్ రావు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆ సుపత్రిలో రెండు నూతన అంబులెన్స్‌లను ఎమ్మెల్యేతో కలిసి ప్రా రంభించారు. వారు మాట్లాడుతూ గత ఏడాది కాలంలో డిస్టిక్ మినరల్ ఫౌండేషన్ (డీఎంఎఫ్) నిధుల నుంచి వైద్య రంగానికి రూ. 9 కోట్లకు పైగా నిధులను కేటాయించామన్నారు. వెంటిలే టర్ల కొరతను అధిగమించేందుకు పదికి పైగా నూతన వెంటిలే టర్లను కొనుగోలు చేశామన్నారు. అంబులెన్స్ సేవల నిర్వహణ వివిధ మండలాల నుంచి ఆసుపత్రులకు రోగులను తరలించే దూరాలు, చార్జీలపై రాబోయే పది రోజుల్లో సంబంధిత అధి కారులతో సమావేశమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటి మేయర్ సల్ల రమ్య, ఆసుపత్రి సూపరింటెండెంట్ అశోక్, ఆర్‌ఎంవో శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్, వైద్యాధికారులు పాల్గొన్నారు.