Share News

మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించం

ABN , Publish Date - Sep 19 , 2026 | 11:36 PM

మత్స్యకారుల కుల వృత్తికి ఆ టంకాలు కల్గిస్తూ బతుకుతెరువు లే కుండా అన్యాయం చేస్తే సహించేది లే దని జిల్లా మత్స్యకార సహకార సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల అల్లోజీ హెచ్చరించారు.

మత్స్యకారులకు అన్యాయం జరిగితే సహించం
మాట్లాడుతున్న తుమ్మల అల్లోజీ

- మత్స్య సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల అల్లోజీ

బిజినేపల్లి, సెప్టెంబరు19 (ఆంధ్ర జ్యోతి) : మత్స్యకారుల కుల వృత్తికి ఆ టంకాలు కల్గిస్తూ బతుకుతెరువు లే కుండా అన్యాయం చేస్తే సహించేది లే దని జిల్లా మత్స్యకార సహకార సంఘం ఉపాధ్యక్షుడు తుమ్మల అల్లోజీ హెచ్చరించారు. మండల కేంద్రంలోని మత్స్యకార సహకార సం ఘం భవనంలో శనివారం మత్స్యకారులతో కలి సి ఆయన మాట్లాడారు. మంగనూర్‌ మత్స్య కార సొసైటీ ఆధీనంలోని కొత్తకుంట శిఖం భూ మి ఎఫ్‌టీఎల్‌లో జరిగిన అక్రమాలపై ఆయన మాట్లాడారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని పట్టా భూమి యజమానులైన, సర్పంచులైన, రియల్‌ వ్యాపారులైన చేపలు పట్టుకునే హక్కులేదని, అలాగే మత్స్యకారులను ఆపే అధికారం కూడా లేదని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. కొత్తకుంటలో నల్లమట్టి దోచుక పోవడమే కాకుండా హద్దులను తోవ్వేసిన వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకొని మత్స్యకారుల కు న్యాయం జరిగే వరకు జిల్లావ్యాప్తంగా ఏక మై ఆందోళన చేపడుతామని అన్నారు. ఆయన వెంట మండల మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షుడు గూడ కాశన్న, బోల కృష్ణయ్య, మంగ నూర్‌ గ్రామ అధ్యక్షుడు నరసింహ, మల్లికా ర్జున్‌, యాదయ్య, శ్రీకాంత్‌, సాయి ఉన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 11:36 PM