kumaram bheem asifabad- ఆదివాసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం
ABN , Publish Date - Sep 27 , 2026 | 10:22 PM
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం టైగర్ జోన్‌ల పేరట కుట్ర పన్నుతుందని, ఆదివాసులు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపురావ్ హెచ్చరించారు. లింగాపూర్ మండలంలోని ఘుమ్నూర్( బి)లో సర్పంచ్ ఆత్రం శేషనారాయణ అధ్యక్షతన లింగాపూర్ మండల రాయి సెంటర్ సమవేశం ఆదివారం నిర్వహించారు.
లింగాపూర్/సిర్పూర్(యు)/జైనూర్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం టైగర్ జోన్‌ల పేరట కుట్ర పన్నుతుందని, ఆదివాసులు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ సోయం బాపురావ్ హెచ్చరించారు. లింగాపూర్ మండలంలోని ఘుమ్నూర్( బి)లో సర్పంచ్ ఆత్రం శేషనారాయణ అధ్యక్షతన లింగాపూర్ మండల రాయి సెంటర్ సమవేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజజీ ఎంపీ సోయం బాపూరావ్, జాతీయ నాయకులు సిడాం అర్జు, ఆయా మండలాల సార్మేడిలలు ముఖ్య ఆతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొదట ఆదివాసీలు పడుతున్న ఇబ్బందులు ఆదివాసీ ఆగ్ర నేతల దృష్టికి తీసుకెళ్ళారు. ఈ ప్రాంతంలో తమ భూములకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు, తాత్త మూత్తాల నుంచి సాగు చేస్తున్న భూములపై అటవీ శాఖ అధికారుల పెత్తనం అధికమైందని వివరించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపూరావ్ మాట్లాడుదూ గిరిజన ప్రాంతంలో పెసా చట్టం ఉందని చెప్పారు. వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆమాయక గిరిజన రైతుల వద్ద సంక్షేమ పథకాలు, రుణాలు ఇస్తామని చెప్పి సంతరాలు తీసుకోని ఈ ప్రాంత భూములను టైగర్ జోన్ పరిధిలోకి మార్చారని వివరించారు. భవిష్యత్తులో ఇలా జరగకుంగా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగగా కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని తన ఆఽధిపత్యం, గొప్పతం కోసం ఆరాట పడుతున్నారని చెప్పారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములను లాక్కోనే కుటీల రాజకీయాలకు పాల్పడితే శాంతి యుతంగా ఉద్యమ బాట పడతామని చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా తమ సమస్యలు పరిష్కరించేందుకు రాజ్ గోండ్ సేవా సమితి ముందంజలో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో 132 గ్రామాల రైతులకు టైగర్ జోన్‌ల పేరట అటవీ శాఖ దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేస్తామన్నారు. ఇది వరకే ఈ సమస్యల్ని కేంద్ర మంత్రికి వివరించామని అన్నారు. న్యాయం జరిగేలా ముందుకు సాగుతున్నామని హామీ ఇచ్చారు. టైగర్ కారిడార్ పేరట గిరిజన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పా రు. జిల్లా ఇన్‌చార్జి మంతి జూపల్లి కృష్ణారావ్‌తో మాట్లాడతామన్నారు. ముఖ్యంగా ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాలను కాపాడుకుంటు వాటిని భావి తరాలకు అందజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాతీయ నాయకులు సిడాం అర్జు, ఆత్రం ఆనంద్‌రావ్, అర్క మానిక్‌రావ్, సార్యేడిలు మడావి శేషరావ్, ఆత్రం ఆనంద్‌రావ్, గణపత్, సోయం గంగారాం, సభ్యులు కుర్సెంగ తానాజీ, కుంర జంగు, మేస్రాం నాగోరావ్, కనక మోతిరాం, ఆత్రం అనిల్ తదితరులు పాల్గొన్నారు.