మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం
ABN , Publish Date - Feb 01 , 2026 | 10:50 PM
ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రిపై అ నుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాఽథ్ రెడ్డి పే ర్కొన్నారు.
డీసీసీ ప్రెసిడెంట్ రఘునాఽథ్ రెడ్డి
చెన్నూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఇటీవల మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి వివేక్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మంత్రిపై అ నుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాఽథ్ రెడ్డి పే ర్కొన్నారు. ఆదివారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గాన్ని మంత్రి వివేక్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సోమనపల్లి గ్రామంలో సుమారు రూ. 250 కోట్లతో నిర్మిం చబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పాటు పట్టణంలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నారని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గాన్ని బాల్కసుమన్ తానే అభివృద్ధి చేసినట్లు చెప్పుకుంటూ ప్ర జలను మోసం చేస్తున్నారని ప్రజలు బాల్క సుమన్ మాటలను నమ్మ వద్దన్నారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.