kumaram bheem asifabad-ఎమ్మెల్సీపై ఆరోపణలు సహించబోం
ABN , Publish Date - Sep 06 , 2026 | 11:02 PM
ఎమ్మెల్సీ దండే విఠల్‌పై ఆరోపణలు సహించబోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నాహీర్‌అలీ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎమ్మెల్సీ దండె విఠల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదన్నారు.
బెజ్జూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్సీ దండే విఠల్‌పై ఆరోపణలు సహించబోమని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి నాహీర్‌అలీ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎమ్మెల్సీ దండె విఠల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సహనం కోల్పోయి మాట్లాడటం సరికాదన్నారు. తరచూ పార్టీలు మార్చే మీరు దండె విఠల్‌ను రంగులు మార్చే నాయకుడని అనడం సరికాదన్నారు. కోనప్ప కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ దండె విఠల్ బీసీ బిడ్డ..మరోసారి ఆయనపై ఆరోపణలు చేస్తే సహించమన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తిపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, కోనప్ప ఇద్దరు ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ చేసి ఇద్దరు కలిసిపోలేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు చిరంజీవి, శ్రీహరి, రాంప్రసాద్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ శ్రీవర్ధన్, నాయకులు పెంటయ్య, రామకృష్ణ, సిరాజ్, శ్రీకాంత్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూరు(టి), సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌పై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ అఖిల్ తెలిపారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే ఇలాంటి చౌక బారు ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో గణనీయమై అభివృద్ధి సాధ్యమన్నారు. సిర్పూరు నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వివరించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తయ్య, మహ్మద్ సోహెల్ అహ్మద్, దుర్గం తులసీరాం, అఫ్సర్ అహ్మద్ ఖాన్, ఎం.ఎ.సలీం, దవులత్, తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో అందరికి మేలు జరుగుతుందని జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దాల దేవయ్య అన్నారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మూడు రోజుల క్రితం కౌటాలలో రైతు సదస్సులో మాజీ మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై లేని పోని ఆరోపణలు చేశారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా ఆదిలాబాద్ ఎమ్మెల్సీపై దండే విఠల్‌పై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు డుబ్బుల నానాయ్య, వెంకయ్య, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం జానకిరాం, నికోడే గంగారావు, తదితరులు పాల్గొన్నారు.