Share News

kumaram bheem asifabad- ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటే ఊరుకోం

ABN , Publish Date - Oct 25 , 2026 | 10:13 PM

పీఎం జన్‌మన్‌ పథకం కిందా కొలాం గిరిజనులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలను అనుమతుల పేరుతో అటవీశాఖ అధికారులు అడ్డుకుంటే ఊరు కునేది లేదని కొలాం సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీడాం అన్నిగ హెచ్చరించారు.

kumaram bheem asifabad- ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటే ఊరుకోం
మాట్లాడుతున్న కొలాం సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీడాం అన్నిగ

వాంకిడి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మన్‌ పథకం కిందా కొలాం గిరిజనులకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలను అనుమతుల పేరుతో అటవీశాఖ అధికారులు అడ్డుకుంటే ఊరు కునేది లేదని కొలాం సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సీడాం అన్నిగ హెచ్చరించారు. స్థానికంగా ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొలాం తె గకు చెందిన గిరిజనులకు ప్రతి కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం జన్‌మన్‌ పథకం కిందా ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కొలాం గిరిజన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలను అనుమతులు లేకుండా నిర్మించవద్దని ఆటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని వివరించారు. జిల్లాలోని వాంకిడి, ఆసిపాబాద్‌, కెరమెరి, జైనూర్‌, లింగాపూర్‌, సిర్పూర్‌ యు తిర్యాణి, రెబ్బెన, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ టి మండలాల్లో 156 కొలాం గిరిజన గ్రామాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ గ్రామాల్లో పీఎం జన్‌మన్‌ పథకం కింద ప్రతి కుటుంబానికీ ఇళ్లు మంజూరైనాయని చెప్పారు. అటవీశాఖ అధికారులు అనుమతుల పేరిట నిర్మాణాలను నిలిపివేస్తుం డడంతో ఆందోళనకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. కొలాం గిరిజనుల ఇళ్ల నిర్మాణాలను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్న విషయాన్ని ఇటీవల జిల్లా ఆటవీశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. అటవీశాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలకు అడ్డు రాకుండా అనుమతించాలని కోరారు. లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో దొడ్డిగుడ సర్పంచ్‌ మడావి నాగోరావు, కొలాం సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సీడాం పగ్గు, నాయకులు ఆత్రం రాము, మడావి జైరాం, సీడాం భీంరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2026 | 10:13 PM