బీసీ మంత్రుల జోలికొస్తే ఊరుకోం
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:19 PM
రాష్ట్రంలో బీసీ మంత్రుల జోలికొస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదని బీసీ జాగృతి సే న రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
- బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణయాదవ్
నాగర్‌కర్నూల్ టౌన్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యో తి) : రాష్ట్రంలో బీసీ మంత్రుల జోలికొస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదని బీసీ జాగృతి సే న రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవా రం జిల్లా కేంద్రంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ జాగృతి సేన ము ఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ త న కూతురు మాట్లాడిన మాటలతో తనకు ఎ లాంటి సంబంధం లేదని, ఆమె వ్యక్తిగత అభి ప్రాయమని వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు, నాయకులు డిమాండ్ చేయడం సమం జసం కాదన్నారు. గతంలో మంత్రి పదవి రా లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు తీవ్ర వ్యా ఖ్యలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీసీ ప్రజాప్రతినిధులను మను షులుగా కూడా గౌరవిం చడం లేదని, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబో మని స్పష్టం చేశారు. అగ్రవర్ణ నాయకుల వ్యా ఖ్యలు గుర్తు రావా అని ప్రశ్నించారు. బీసీలను అవమానించే నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన బుద్ధిచెబుతామ ని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జా తీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అ ధ్యక్షుడు కాళ్ల నిరంజన్, జిల్లా వర్కింగ్ ప్రెసి డెంట్ కుంభం మల్లేష్‌గౌడ్, బీసీ మహిళా జిల్లా అధ్యక్షురాలు రేణుక, నాయకులు నేష లక్ష్మయ్య, సుధాకర్ గౌడ్, రాజు, చైతన్య పాల్గొన్నారు.