అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తాం
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:26 PM
కార్పొరేషన్ లో ని అన్ని కాలనీల్లో అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామ ని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. కార్పొరేషన్ లోని 26వ డివిజన్‌లో మంగళవారం శుభ్రత-పరిశుభ్రత, ప్ర గతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లో పర్య టించారు. డివిజన్‌లో డ్రైనేజీలు, మంచినీటి సమస్య, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు తదితర సౌకర్యాల ను తొందరగానే కల్పిస్తామన్నారు.
26వ డివిజన్‌లో డ్రైనేజీని పరిశీ లిస్తున్న మేయర్ ధర్ని మధుకర్
26వ డివిజన్‌లో పర్యటించిన మేయర్
నస్పూర్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్ లో ని అన్ని కాలనీల్లో అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామ ని మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. కార్పొరేషన్ లోని 26వ డివిజన్‌లో మంగళవారం శుభ్రత-పరిశుభ్రత, ప్ర గతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లో పర్య టించారు. డివిజన్‌లో డ్రైనేజీలు, మంచినీటి సమస్య, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాలు తదితర సౌకర్యాల ను తొందరగానే కల్పిస్తామన్నారు. డివిజన్‌లో చేయా ల్సిన పనులు, సమస్యలను స్థానికులను అడిగి తెలు సుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వచ్చే వర్షకాలంలో వరద నీరు ఇళ్లలోకి రాకుండా చర్య లు చేపట్టనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ మంచి నీటి పైపులైన్ మరమ్మతులపై దృష్టి సారించినట్లు తెలి పారు. డివిజన్‌లోని ప్రజలు ఇళ్లలోని చెత్తను సేకరణకు వచ్చిన సిబ్బందికి అందజేయాలన్నారు. ఎక్కడపడితే అ క్కడ చెత్తను వేయవద్దని, కాలనీల్లో పరిశుభ్రత పాటిం చాలని సూచించారు. పట్టణ పరిశుభ్రతకు అందరూ స హకరించాలని మేయర్ కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పేరేటర్ ఇరగదిండ్ల రవి, వివిధ డివిజన్లకు చెందిన కార్పోరేటర్లు, డివిజన్ నాయకులు, ఆఫీసర్లు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.