Share News

మహిళలను ఆర్థిక శక్తిమంతులను చేస్తాం

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:13 PM

మహిళలను ఆర్థికంగా శక్తి మంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

మహిళలను ఆర్థిక శక్తిమంతులను చేస్తాం
పట్టణ పేద మహిళలకు వడ్డీలేని రుణాల చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

- కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి,జనవరి19 (ఆంధ్రజ్యో తి) : మహిళలను ఆర్థికంగా శక్తి మంతులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో కేబీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌లో పట్టణ పేద మహిళలకు రూ.1,05,99,143ల వడ్డీలేని రుణాల చెక్కును ఎమ్మెల్యే అందజే శారు. త్వరలో జరగబోయే కల్వకుర్తి మునిసిప ల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించా లని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిష నర్‌ మహమ్మద్‌ షేక్‌, కల్వకుర్తి మాజీ సర్పంచ్‌ బృంగి ఆనంద్‌కుమార్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షు డు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ డైరె క్టర్లు పసుల రమాకాంత్‌రెడ్డి, మసూ ద్‌, నాయ కులు కాయితీ విజయ్‌కుమార్‌రెడ్డి, మిరియాల శ్రీనివాస్‌రెడ్డి, రేష్మాబేగం, హనుమాన్‌ నాయక్‌, పి.శేఖర్‌, సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన మైనార్టీ నాయకులు

కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 30మంది మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కల్వకుర్తి మాజీ సర్పంచు బృంగి ఆనంద్‌కు మార్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్‌రెడ్డి, నాయకుడు సోఫీ ఆధ్వర్యంలో వారు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:13 PM