కొల్లాపూర్‌ను పచ్చలహారంగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:07 PM
వనమహోత్సవంలో విరివిగా మొ క్కలు నాటి కొల్లాపూర్ మునిసిపాలి టీని పచ్చదనంతో నింపుతామని ముని సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి అన్నారు.
- వన మహోత్సవంలో కొల్లాపూర్ మునిసిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి
కొల్లాపూర్ , జూలై 30 (ఆంధ్రజ్యో తి) : వనమహోత్సవంలో విరివిగా మొ క్కలు నాటి కొల్లాపూర్ మునిసిపాలి టీని పచ్చదనంతో నింపుతామని ముని సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి అన్నారు. గురువారం కొల్లాపూర్ మునిసిపాలిటీ ప రిధిలోని కస్తూర్బా బాలికల పాఠశాల ఆ వరణలో మునిసిపల్ కమిషనర్ శంకర్, కౌన్సి లర్లు, విద్యార్థినులతో కలిసి చైర్‌పర్సన్ మొక్క లు నాటారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల పరిసరాల్లో మొక్కల పెంపకం కార్య క్రమాలను ఆమె పర్యవేక్షించారు. కొల్లాపూర్ మునిసిపాలిటీ పరిధిలో ఈ వనమహోత్సవం లో భాగంగా ఏకంగా లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నా మని అన్నారు. ఈ వన మహోత్సవ వేడుకల్లో మునిసిపల్ కమిషనర్ శంకర్, వివిధ వార్డుల మునిసిపల్ కౌన్సిలర్లు బోరెల్లి మహేశ్, ఎండీ అన్వర్, పసుల సుజాత, ఎండీ ఖాదర్ పాషా, మానవపాడు నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు రెడ్డి సత్యం, కాటమోని వేణు గోపాల్ గౌడ్, వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్లు, మునిసిపల్ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.