అవినీతి రహిత నగరపాలక సంస్థగా తీర్చిదిద్దుతా
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:31 PM
అవినీతి రహిత కార్పొరేషన్‌గా మంచిర్యాలను తీర్చిదిద్దుతానని మేయర్ ఽధర్ని మధూకర్ అన్నారు. ఆదివారం ఆయన అబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంచిర్యాల తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
-మేయర్ దర్ని మధూకర్
మంచిర్యాల క్రైం, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి) : అవినీతి రహిత కార్పొరేషన్‌గా మంచిర్యాలను తీర్చిదిద్దుతానని మేయర్ ఽధర్ని మధూకర్ అన్నారు. ఆదివారం ఆయన అబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంచిర్యాల తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా మధూకర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పీఎస్‌ఆర్ ఆశిస్సులతో ఈ అవకాశం దక్కిందన్నారు. మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపిస్తానన్నారు. నగరాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపేం దుకు అందరు కార్పొరేటర్ల సహాయ సహకారాలు తీసుకొని కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజల్లో ఉంటూ పని చేస్తామన్నారు. తనపై నమ్మకంతో డిప్యూటీ మేయర్ పదవి కట్టబె ట్టిన ఎఎ్మల్యే ప్రేంసాగర్ రావుకు రుణపడి ఉంటానని డిప్యూటీ మేయర్ సల్ల రమ్యమహేష్ అన్నారు. ఎమ్మెల్యే సహకారంతో అన్ని డివిజన్లు అభి వృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే ఆశిస్సులు తీసుకున్న అనంతరం కమి షనర్ జి. అన్వేష్ ఆమెను సన్మానించారు.
కార్పొరేషన్‌ను రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలుపుతాను
ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యువకులు, విద్యావంతులైన మేయర్, డిప్యూటీ మేయర్‌ల సారథ్యంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ చేయలేని విధంగా నియోజకవర్గంలో స ర్పంచు, మున్సిపాలిటీ, మేయర్ ఎన్నికల్లో యువతకు ఎక్కువ ప్రాథన్యత ఇచ్చిన ఘతన తమకే దక్కుతుందన్నారు. యువతతోనే అభి వృద్ధి సాద్యమన్నారు. అభివృద్ధి కోసమే యువతకు పదవులు కట్టబెడు తున్నామన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభు త్వ ప్రథమ ప్రాధాన్యం అన్నారు. నగరంలో మంచినీటి సమస్యను పూ ర్తిగా పరిష్కరిస్తామన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులతో కలిసి సుపరిపాలన సాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, పట్టణ అధ్యక్షులు తూము నరేష్, బ్లాక్ కాం గ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.