చెన్నూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
ABN , Publish Date - Feb 27 , 2026 | 11:09 PM
చెన్నూరును ఆదర్శ మున్సి పాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వ హించిన చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్ర మంలో పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌ను శాలువాలతో సన్మానించి శుభాకాంక్ష లు తెలిపారు.
మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరును ఆదర్శ మున్సి పాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వ హించిన చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్ర మంలో పాల్గొన్నారు. చైర్‌పర్సన్‌ను శాలువాలతో సన్మానించి శుభాకాంక్ష లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చైర్‌పర్సన్, కౌన్సి లర్లు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మున్సిపాలిటీలో సుమారు రూ. 50 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలి పారు. అనేక వార్డుల్లో బోర్‌వెల్స్, సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. అమృత్ 2.0 పథకం ద్వారా ఇంటింటికి తాగు నీరు అందజేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరిట నిధులను దుర్వినియోగం చేసిందని విమర్శించారు. పట్టణ ప్రజ లకు గోదావరి నుంచి శుద్ద జలాల పథకాన్ని అమలు చేస్తామన్నారు. త్వరలో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కూడా చేపడతామన్నారు. మున్సిపాలిటీలో వంద ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. దేవులవాడ, బబ్బరచెలుక గ్రామాల రైతులకు సుమారు రూ. 18 క్లో పరిహారం మంజూరుచేసి పంపిణీ చేశామన్నారు. మేలో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. చెన్నూరును ఆదర్శ మున్సి పాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారు లు, నాయకులు పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధికి కృషి చేస్తా : చైర్‌పర్సన్
చెన్నూరు పట్టణాభివృద్ధికి తన వంతు కృషి చేసి మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దిం టి పద్మ అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో పదవీ బాద్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మా ట్లాడారు. చెన్నూరులో ప్రధానంగా ఉన్న సమస్యలు మురికి కాలువలు, రహదారులపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం ఆమె తో పాటు వైస్ చైర్మన్ వినయ్‌కుమార్ పదవీ బాధ్యలు స్వీకరించారు. కమీషనర్ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.