Share News

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:17 PM

మండలంలోని చెంచు గూడెంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం ప లువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ఎమ్మెల్యే వంశీకృష్ణ

- ఇందిరమ్మ ఇళ్లపట్టాలు అందజేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

బల్మూరు, అక్టోబరు 4 (ఆంధ్ర జ్యోతి) : మండలంలోని చెంచు గూడెంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ ఆదివారం ప లువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ల బ్ధిదారులకు పట్టాలు అందజేస్తూ ఇల్లులేని పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరుస్తున్నా మని తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాల అందేలా కృషి చేస్తామని తెలిపారు. కొండనా గుల గ్రామంలో మేదర సంఘానికి సంబంధిం చిన మల్లమ్మ దేవాలయానికి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. పనులను త్వరగా చేపట్టాలని ఆయన ఆ సం ఘం సభ్యులకు ఎల్‌వోసీ అందజేశారు. కార్యక్ర మంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

దేవీనవరాత్రుల కరపత్రం విడుదల

అమ్రాబాద్‌, (ఆంధ్రజ్యోతి): అమ్రాబాద్‌ మండల కేంద్రంలోని అమరేశ్వర ఆలయ కమి టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దేవీనవరాత్రు ల కరపత్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆ విష్కరించారు. కార్యక్రమంలో అమరేశ్వర ఆల య కమిటీ చైర్మన్‌ తిప్పర్తి శ్రీనివాసులు, అమ్రా బాద్‌ సర్పంచ్‌ చిగుళ్ల కోటయ్య, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పోల సత్యనారా యణ, బాల్‌లింగంగౌడ్‌, లక్ష్మణాచారి, ముద్దం రాములు, గోలి వెంకటయ్య, ఇమ్మడి వెంకటే శ్వర్లు, సోగురు రాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:17 PM