kumaram bheem asifabad-ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ బీమా వర్తింపజేస్తాం
ABN , Publish Date - Nov 13 , 2026 | 10:34 PM
: రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని తన చాంబర్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ప్రణాళికశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని తన చాంబర్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ప్రణాళికశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 19న మాజీ ప్రదాని ఇందిరగాంధీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ కుటుంబ జీవితబీమా పథకాన్ని ప్రారంభించనున్నామని చెప్పారు. అదే రోజు అన్ని గ్రామపంచాయతీలలో, మున్సిపాలిటీలలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో ప్రతి వార్డులో కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. దరఖాస్తుపై కుటుంబ పెద్ద సంతకం తీసుకోవాలని తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర్టానికి చెందినవారై వయస్సు 19 నుంచి 59 సంవత్సరాలలోపు వారు అర్హులని తెలిపారు. ఈ పథకంపై జిల్లాలో ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, డీపీవో భిక్షపతి, డీఆర్‌డీవో దత్తారావు, సీపీవో గురువయ్య, డీవైఎస్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు అంజయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.