Share News

జగన్మోహన్‌రావును కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తాం

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:56 PM

మంత్రి వివేక్‌ వెం కట స్వామి, ఎంపీ వంశీకృష్ణ పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో జగన్మో హన్‌రావు వర్గాన్ని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరింపజేస్తామని మేయర్‌ ధ రణి మధుకర్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు తూముల నరేష్‌, జిల్లా ఐ ఎన్‌టీయూసీ నాయకుడు పూజారి తిరుపతి అన్నారు.

జగన్మోహన్‌రావును కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తాం

మేయర్‌ ధర్ని మదుకర్‌

మంచిర్యాలక్రైం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : మంత్రి వివేక్‌ వెం కట స్వామి, ఎంపీ వంశీకృష్ణ పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో జగన్మో హన్‌రావు వర్గాన్ని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరింపజేస్తామని మేయర్‌ ధ రణి మధుకర్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు తూముల నరేష్‌, జిల్లా ఐ ఎన్‌టీయూసీ నాయకుడు పూజారి తిరుపతి అన్నారు. మంచిర్యాల ఎ మ్మెల్యే ప్రేంసాగర్‌రావు నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మంత్రికి, రాష్ట్ర పీసీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దగ్గర కుట్ర రాజకీయ పప్పులు ఉడకవని, మిత్ర పక్షం పాటు ప్రతి ప క్షాలు కూడా ఎమ్మెల్యేపై దాడి చేస్తున్నాయన్నారు. మంచిర్యాల అభి వృద్ధిలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని మంత్రి, ఎంపీ వర్గ పోరుకు తెరలేపారన్నారు. ఇంత వరకు కాంగ్రెస్‌ కండువా కప్పుకోలేని మంతెన జగన్మోహన్‌రావు కాంగ్రెస్‌ పార్టీని విచ్చి న్నం చేసి కుట్రకు తెరలేపడం చూసి ఈ వర్గాన్ని కాంగ్రెస్‌ నుంచి బ హిష్కరించేలా తమ కార్యచరణ ఉంటుందని తెలిపారు. ఎంపీ లాడ్స్‌ నిధులు కేవలం ఒకటి, రెండు డివిజన్‌లకు ఇస్తే సరిపోదని, అన్ని డి విజన్‌ల ప్రజలు ఓటేస్తేనే గెలిచావని గుర్తుంచు కోవాలన్నారు. కార్పొ రేషన్‌లో ఆ వర్గం చేసే కార్యక్రమాలకు ప్రథమ పౌరుడు మేయర్‌, డి ప్యూటి మేయర్‌తో పాటు ఏఎంసీ చైర్మన్‌ ఫోటోలు ఫ్లెక్సీలో పెట్టక పోవ డం తీవ్ర అభ్యంతకరమని తెలిపారు. ప్రేంసాగర్‌రావును ఎదురుగా ఢీ కొట్టే ధైర్యం లేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ సమా వేశంలో నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2026 | 11:56 PM