ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తాం
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:09 PM
పట్టణంలో శనివారం రాత్రి గాలి భీభత్సానికి కూలిపోయిన గృహాలను, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను ఆదివారం రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణలు పరిశీలించారు.
మంత్రి వివేక్‌వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ
మందమర్రిటౌన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో శనివారం రాత్రి గాలి భీభత్సానికి కూలిపోయిన గృహాలను, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను ఆదివారం రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి, ఆయన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణలు పరిశీలించారు. కాలినడకన రెం డవ జోన్, వివిధ కాలనీలను సందర్శించారు. బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తామన్నారు. తహసీల్దార్ సతీష్‌కుమార్‌ను నష్టం అంచనా వేయాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ పనులను త్వరగా పునరుద్దరించాలన్నారు. విద్యుత్ స్తంభాల పక్కన ఉన్న చెట్ల గురించి ప్రణాళిక రూపొందించి చెట్లు విద్యుత్ తీగలపై పడ కుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ప్రజలందరు అప్రమ త్తం గా ఉండాలన్నారు. నాయకులు, కార్యకర్తలకు బాధితులకు సహాయ సహ కారాలు అందించాలన్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల్, పుల్లూరి లక్ష్మణ్, సుదర్శన్, జావేద్, శంకర్, గుడ్ల రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.