kumaram bheem asifabad-రైల్వే బాధితులకు న్యాయం చేస్తాం
ABN , Publish Date - Jul 09 , 2026 | 10:19 PM
రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తెలిపారు. గురువారం రెబ్బెన రైల్వే బాధితులతో మాట్లాడి దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే బాధితులు మాట్లాడుతూ తమను రైల్వే అధికారులు తరుచూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు.
రెబ్బెన, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రెబ్బెన మండల కేంద్రంలోని రైల్వే బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తెలిపారు. గురువారం రెబ్బెన రైల్వే బాధితులతో మాట్లాడి దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైల్వే బాధితులు మాట్లాడుతూ తమను రైల్వే అధికారులు తరుచూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు. జాయింట్ సర్వే నిర్వహించినప్పటికీ అదనపు భూమి ఉన్నట్టు తేలిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తప్పకుండా బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఈయన వెంట సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు, జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, కె కిరణ్‌కుమార్, చక్రపాణి, ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి అభివృద్ధే కేంద్రం లక్ష్యం
సింగరేణి అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమమే ప్రధాని మోదీ లక్ష్యమని అందుకే ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండా తాడిచెర్ల బ్లాక్ 2 గనిని సింగరేణికి కేటాయించారని ఎంపీ గోడం నగేష్ అన్నారు. మండలంలోని గోలేటి ఏరియాలో గల కైరిగూడ ఓపెన్ కాస్టు మైన్ వద్ద నిబంధనలను పక్కన పెట్టి ఎటువంటి వేలం లేకుండా సింగరేణి సంస్థకు కేటాయించిన సందర్భంగా ప్రధాని మోదీ చిత్రపటానికి ఎంపీ గోడం నగేష్ క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా కృషి చేస్తోందన్నారు. సింగరేణి సంస్థకు తాడిచెర్ల మైన్ కేటాయించడంతో 1,200 మందికి ఉపాధి అభించనుందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, రాష్ట్ర కార్యవర్య సభ్యుడు అరిగెల నాగేశ్వర్ రావు, కొట్నాక విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్, ఆత్మ నిర్బర్ భారత్ జిల్లా కమిటీ కన్వీనర్ కేసరి ఆంజనేయులుగౌడ్, కోశాధికారి కొలిపాక కిరణ్‌కుమార్, చెవూరి నవీన్‌గౌడ్, చక్రపాణి, సొల్లు లక్ష్మి, సునీల్ చౌదరి, బాలకృష్ణ, మండల అధ్యక్షుడు మల్రాజ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చదువుపై దృష్టి సారించాలని ఎంపీ నగేష్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని పీఎం శ్రీ కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న భోజన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పాఠశాలలో రూ. 3.20 కోట్ల నిధులతో జరుగుతున్న అదనపు భవణ నిర్మాణ పనులను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా సకాలంలో పూర్తి అయ్యేల చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్‌రావు, కోట్నక విజయ్, సుచిత్, దుర్గం ప్రశాంత్, వెంకటేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.