నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:33 PM
చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వేలాల గ్రామంలో మల్లన్న స్వామిని దర్శించుకున్నారు.
మంత్రి వివేక్‌వెంకటస్వామి
జైపూర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వేలాల గ్రామంలో మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గోదావరి తీరం లో నీటి పారుదల , ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో రూ. 4.20 కోట్లతో పుష్కరఘాట్ నిర్మాణ పనులకు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్ధాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల అభివృద్ధి కో సం రూ. 70 కోట్లు, చెన్నూరులోని శివాలయం అభివృ ద్ధికి రూ. 17 కోట్లు మంజూరు చేశామన్నారు. మొసళ్ల పార్కు అభివృద్ధికి నిధులు కేటాయించి, గాంధారి మైస మ్మ ఆలయం తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూ పొందిస్తామన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్ విస్తరణ ద్వా రా సుమారు 5 వేల మందికి ఉపాధి లభించే అవకా శం ఉందన్నారు. సింగరేణి సంస్థకు చెందిన ఆర్కే ఓసీ పీ గని ప్రారంభంతో ఉపాధి అవకాశాలు పెరుగుతా యని, మందమర్రిలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నా లజీ సెంటర్ ద్వారా యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. చెన్నూరులో వంద పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభింస్తామని, మందమర్రిలో 50 పడక ల ఆసుపత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించామ న్నారు. ఎల్‌నినోతో ఏర్పడిన పరిస్థితులను ప్రజలంద రు ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏ సీపీ వెంకటేశ్వర్, సర్పంచు డేగ స్వప్ననగేష్, తహ సీ ల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో శ్రీపతి బాపురావు, పార్టీ మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, చల్ల సత్యనారాయ ణరెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.