ఆలయ అభివృద్ధికి సహకరిస్తాం
ABN , Publish Date - Oct 15 , 2026 | 11:19 PM
మండల పరిధిలో ని అప్పాజీపల్లి శివారులో నరసన్న గుట్టపై వెలిసిన శీలక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజే శ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి తనవం తు సహకారం అందిస్తానని అన్నా రు.
- ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి
తిమ్మాజిపేట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలో ని అప్పాజీపల్లి శివారులో నరసన్న గుట్టపై వెలిసిన శీలక్ష్మీనరసింహ స్వామిని ఎమ్మెల్యే కూచకుళ్ల రాజే శ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి తనవం తు సహకారం అందిస్తానని అన్నా రు. వేద పండితులు గంగాధర శర్మ, శ్రీలక్ష్మీనరసింహస్వామికిమహాలక్ష్మి, ఆండాలమ్మ అమ్మవార్లకు పలురకాల అభిషే కాలు నిర్వహించారు. భక్తులకు మెరుగైన వస తులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామ ని తెలిపారు. అంతకు ముందు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వా గతం పలికారు. శాలువాలు కప్పి సన్మానించా రు. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుని ఇటీవల గృహ ప్రవేశం జరుపుకున్న లబ్దిదారుని ఇంటికి వెళ్లి పూజలు నిర్వహించి వారితో మాట్లాడారు. జల్లి తిరుపతయ్యకు మెరుగైన వైద్యం కోసం మం జూరైన రూ.3లక్షల ఎల్వోసీని అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చిలుక సురేందర్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు చిలుక వివేక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిలుక రామచం ద్రారెడ్డి, చిలుక ఎల్లారెడ్డి, నాయకులు చిలుక భాస్క ర్‌రెడ్డి, వెంకట య్య, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, అశోక్‌రెడ్డి, సర్పంచ్ అబ్బసల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.