kumaram bheem asifabad- పాఠశాల అభివృద్ధికి చేయూతనిస్తాం
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:22 PM
పాఠశాల అభివృద్ధికి తన వంతుగా చేయూతనిస్తామని కలెక్టర్ కె హరిత అన్నారు. సావర్‌ఖేడ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో బుధవారం కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే సావర్‌ఖేడ పాఠశాలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఆ స్థాయికి చేరుకోవడానికి గ్రామస్తుల సహకారం మరవలేనిదన్నారు.
కెరమెరి, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పాఠశాల అభివృద్ధికి తన వంతుగా చేయూతనిస్తామని కలెక్టర్ కె హరిత అన్నారు. సావర్‌ఖేడ గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో బుధవారం కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే సావర్‌ఖేడ పాఠశాలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఆ స్థాయికి చేరుకోవడానికి గ్రామస్తుల సహకారం మరవలేనిదన్నారు. అలాగే గ్రామాభివృద్ధిఖి అందరు సంఘటితంగా గ్రామ ప్రగతి పథంలో ముందుకు సాగాలని చెప్పారు. గ్రామ సమన్యలను సర్పంచ్‌ను అడిగి తెలుసుకున్నారు. సావర్‌ఖేడ గ్రామ ప్రజలు మద్యానికి దూరంగా ఉండడం అభినందనీయమన్నారు. కార్యక్రవుంంలో డీఈవో లలిత, ఎంఈవో ప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు రంగయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్ అత్తేశ్వరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులను సన్మానించిన కలెక్టర్
ఆసిపాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ ఫలితాల్లో జిల్లా టాపర్లుగా నిలిచిన విద్యార్థులు బుధవారం జిల్లా కలెక్టర్ కె హరిత సన్మానించారు. ఈ సందర్భంగా జైనూరు ప్రభుత్వ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థిని ఐశ్వర్య 967, సిర్పూర్(టి) ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఎంపీసీ విద్యార్థి అఖిల్‌సాయివరప్రసాద్ 984 మార్కులు, కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి విశాల్ ఎంపీసీలో 945, తిర్యాణి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి నాగరాజు ఎంపీసీలో 946 వాంకిడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని మంగళ బైపీసీలో 954 మార్కులు, దహెగాం ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి ఎల్కరి సంతోష్ సీఈసీలో 906 మార్కులు సాధించారని చెప్పారు. జిల్లాలో మొత్తం 15 మంది విద్యార్థులు జిల్లా టాపర్‌లుగా నిలవగా వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో డీఐఈవో రాందాస్ తదితరులు పాల్గొన్నారు.