kumaram bheem asifabad-పనులను త్వరగా పూర్తి చేస్తాం
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:35 PM
పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ హరిత అన్నారు. హైదారాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యశాఖ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా సమీక్షించారు.
ఆసిఫాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను త్వరగా పూర్తి చేస్తామని కలెక్టర్ హరిత అన్నారు. హైదారాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, విద్యశాఖ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన అకాడమిక్ పానల్ విజిట్, ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వసతుల కల్పన ఆధార్, అపార్, యూడైస్‌పై పురోగతి, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యశాఖ వారోత్సవాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. 88 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు. కస్తూర్బా గాంధీ, ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆడ్వాన్స్ సప్లిమెంటరీకి సన్నద్ధం చేసేందుకు కోచింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జయశంకర్ బడిబాట కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మట్ తదితరులు పాల్గొన్నారు.
కూలీలకు సౌకర్యాలు కల్పించాలి
రెబ్బెన, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పనుల ప్రదేశంలో కూలీలకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హరిత అన్నారు. రెబ్బెన మండలం ఇందిరానగర్‌లో ఉపాధి హామీ పనులను గురువారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో తాగునీరు, నీడ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి కూలీలకు రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే అర్హులైన ప్రతి కూలీకి వంద రోజుల పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు.