kumaram bheem asifabad-ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతాం
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:28 PM
జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతామని కుమరం భీం జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, ఈఆర్‌వోలు, సబ్ కలెక్టర్‌లు, ఆర్డీవోలు, మండల అధికారులతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఆసిఫాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేపడుతామని కుమరం భీం జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్‌లు, ఈఆర్‌వోలు, సబ్ కలెక్టర్‌లు, ఆర్డీవోలు, మండల అధికారులతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శణ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి సందర్శించి వివరాలు సేకరించి ఓటరు జాబితాలో గల ఓటర్ల మ్యాపింగ్ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు వారి తరపున బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత, అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజక వర్గాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపడుతామన్నారు. రెండు నియోజక వర్గాల్లో 678 మంది బూత్ స్థాయి అధికారులు, 68 మంది సూపర్‌వైజర్లు ప్రఈ ఇంటికి వెళ్లి పరిశీలిస్తున్నారని తెలిపారు. రాజకీయ పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్ల జాబితాను తీసుకుంటున్నామని చెప్పారు. పెండింగ్‌లో గల ఫారం 6, 7, 8 దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశం లో ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దేశానికి సేవలు అందించాలి
ఆసిఫాబాద్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పౌరులు దేశానికి తమ వంతు సేవలు అందించాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శనివారం మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారులు, అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిలటరీ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారులు జిల్లాలో ఈ నెల 24 నుంచి 31 వరకు క్షేత్రస్థాయి పర్యటన చేశారని తెలిపారు. జిల్లాలోని వాంకిడి, బంబార, రెబ్బెన మండలంలోన గోలేటి, సిర్పూర్(టి) మండల కేంద్రం, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలలో సందర్శించి వివిధ విషయాలపై అధ్యయనం చేశారని తెలిపారు. పాఠశాలల్లో తీసుకోవాల్సిన మౌలిక వసతులు, వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన అంశాలపై, రవాణా, విద్య, వైద్య రంగాల్లో చేపట్టాల్సిన అంశాలపై మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారులకు వివరించారు. క్షేత్రస్థాయి అధ్యయనం చేసిన అంశాలు దేశసేవలో ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ సందర్భంగా సీర్వస్ అధికారులు జిల్లాలో అధ్యయనం చేసిన అంశాలను వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ అధికారులు కలెక్టర్‌కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.