Share News

అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:25 PM

త్వరలో జరగబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో కొల్లా పూర్‌ మునిసిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థా నాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర పర్యా టక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు ధీమా వ్యక్తం చేశారు.

అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం
కార్యకర్తలతో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- మునిసిపల్‌ ఎన్నికలపై మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరగబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో కొల్లా పూర్‌ మునిసిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థా నాలు కైవసం చేసుకుంటుందని రాష్ట్ర పర్యా టక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కొల్లాపూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో కాంగ్రెస్‌ కార్య కర్తలు, వార్డు ప్రజలతో మంత్రి సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ వార్డుల ప్రజల అభిప్రాయం మేరకు అభ్య ర్థులను ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ పా ర్టీ చేసిన సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించి భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అభ్య ర్థులను గెలిపించేలా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గురు వారం కొల్లాపూర్‌ పట్టణంలో సురభి బంగ్లా ముందు మహిళలకు చీరల పంపిణీ కార్యక్ర మం ఉంటుందని, అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో భన్సీలాల్‌కు జూపల్లి సూచించారు.

నూతన గ్రంథాలయం పరిశీలన

కొల్లాపూర్‌ పట్టణ కేంద్రంలో ఆధునిక హంగులతో గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్‌ పట్టణంలోని ట్రాన్స్‌ కో కార్యాలయం పక్కన గతంలో నిర్మించిన నూ తన గ్రంథాలయం భవనంలో అన్ని హంగుల తో కూడిన ఆధునిక గ్రంథాలయం ఏర్పాటు చే శామని మంత్రి వెల్లడించారు. గురువారం ప్రా రంభం కానున్న గ్రంథాలయం భవనంలో ఏర్పా టు చేసిన వసతులు, పుస్తకాలను బుధవారం సాయంత్రం మంత్రి పరిశీలించారు. పాఠకులు సద్వినియోగం చేసు కోవాలని అన్నారు.

మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ

పెద్దకొత్తపల్లి, (ఆంధ్రజ్యోతి) :మండల పరిధి లోని చంద్రకల్‌ గ్రామ వాసి మాజీ ఎంపీపీ వర్ధరాజుల వెంకటేశ్వర్‌రావు మాతృమూర్తి భా గ్యమ్మ పది రోజుల క్రితం మృతి చెందింది. బుధవారం దశదినకర్మ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ఆమె చిత్ర పటా నికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సర్పంచ్‌ రమేష్‌రావు, కాంగ్రెస్‌ నాయకు లు చంద్రయ్యయాదవ్‌ ఉన్నారు. యాపట్ల నరసింహ, శ్రీధర్‌రావు, చెన్నపురాంపల్లి మాజీ సర్పంచ్‌ చెంది వెంకటస్వామి, ఉప సర్పంచ్‌ నాగరాజు, రసూల్‌ తదతరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:25 PM