Share News

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

ABN , Publish Date - May 28 , 2026 | 11:26 PM

రైతులు పండించిన చివరి గిం జ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం మండలంలోని బావురావుపేట గ్రామంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

మంత్రి వివేక్‌వెంకటస్వామి

చెన్నూరు, మే 28 (ఆంధ్రజ్యోతి) : రైతులు పండించిన చివరి గిం జ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. గురువారం మండలంలోని బావురావుపేట గ్రామంలోని ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సారి పం ట దిగుబడి ఎక్కువగా వచ్చిందని, గత ఏడాది లక్షా 10 వేల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు జరిపితే ఈ సారి లక్షా 70 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. జూన్‌ 6 వరకు ధాన్యం కొనుగోలు చేప డతామన్నారు. హమాలీల కొరతతో కొంచం ఆలస్యం అవుతుందని, రై తులు అధైర్యపడవద్దని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను 40 లారీలు కావాలని కోరామని, అదే మైనింగ్‌ శాఖలో 45 లారీలను కేటాయిం చామన్నారు. కొంత మంతి పార్టీలకతీతంగా రైతులకు భరోసా కల్పిం చకుండా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిని రైతులు నమ్మవ ద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను ప్రజలు ఓడించడంతో ఆ ఫ్రస్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్కడ ధర్నాలు చేస్తున్నా రైతులు రావడం లేదని బాల్క సుమనే అన్నాడని తెలిపారు. కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో నష్టపోయిన రైతులకు తాను నష్టపరిహారం అందించానని తెలిపారు. చట్టాన్ని చే తుల్లోకి తీసుకుని షో చేయాలని బాల్క సుమన్‌ చూస్తున్నాడని, సిం గరేణి భవన్‌ను కాల్చాలని, రైలు పట్టాలని కోయాలని మాట్లాడడం హేయమైందన్నారు. కావాలనే కార్యకర్తలను రెచ్చగొట్టి ఇక్కడ ఆందో ళనలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నారు బాల్క సుమన్‌ అరెస్టు అయితే జైలుకు వెళ్లి పరామర్శించిన కేటీఆర్‌ బాల్క సుమన్‌ చట్ట వ్యతిరేక వ్యాఖ్యలుచేస్తే ఎందుకు స్పందించడం లేదన్నారు. రాజకీయా ల్లో ఎప్పుడు పలువురికి ఆదర్శంగా నిలవాలే తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజలు,నాయకులను తప్పుదోవ పట్టించే పద్ధతులు మంచివి కావన్నారు. మంత్రి వెంట కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - May 28 , 2026 | 11:26 PM