చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
ABN , Publish Date - May 27 , 2026 | 11:31 PM
రైతులు అధైర్యప డవద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పే ర్కొన్నారు. బుధవారం మండలంలోని టేకుమట్ల గ్రా మంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ దీపక్‌తో కలిసి సందర్శించారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
జైపూర్, మే 27 (ఆంధ్రజ్యోతి) : రైతులు అధైర్యప డవద్దని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పే ర్కొన్నారు. బుధవారం మండలంలోని టేకుమట్ల గ్రా మంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ దీపక్‌తో కలిసి సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ ఈ సారి పంట దిగుబడి గణనీయం గా పెరిగిందని, గత పంటల్లో లక్షా 10 వేల టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి జూన్ 6 వరకు కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగించి లక్షా 70 వేల టన్నులు సేకరించే లక్ష్యంతో ఉన్నామన్నారు. హమాలీల కొరత, లారీల ల భ్యత లేకపోవడంతో కొనుగోళ్లలో కొంత ఆలస్యం జరి గిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సింగరేణి సంస్థ నుంచి లారీలను సమకూర్చాలని కోరామన్నారు. పెద్దప ల్లిలో మూడు గోదాములను అందుబాటులో ఉంచామ ని పేర్కొన్నారు. కొనుగోళ్ల సజావుగా సాగు తుంటే బీ ఆర్‌ఎస్ నాయకులు కావాలని ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలకతీతంగా రైతులకు భరోసా కల్పిం చకుండా ఆందోళనలకు రెచ్చగొడుతున్నారని విమర్శిం చారు. బాల్క సుమన్ ఓడిపోయిన ప్రస్టేషన్‌తో ఇలాం టి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. గత బీఆర్‌ఎస్ హ యాంలో వందలాది లారీలు నిలిచిపోయేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, చట్టాన్ని చేతిలోకి తీసుకుని షో చేయాలని బాల్క సుమన్ చూస్తున్నాడన్నారు. ప్ర భుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఎ న్నికల్లో బాల్క సుమన్ వందకోట్లు ఖర్చు చేశారని, ఈ డబ్బు ఎక్కడిదో ప్రజలు చూశారని మంత్రి పేర్కొన్నా రు. వంద కేసులు వంద కోట్లు అని ప్రచారం చేసుకు న్న బాల్క సుమన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేశారు. సింగరేణిని సర్వనాశనం చే సిన చరిత్ర బీఆర్‌ఎస్‌దేనని, లక్ష ఉద్యోగాలు ఇస్తా మ ని మాట ఇచ్చి తప్పినందుకు సింగరేణి భవన్‌ను కాల్చి వేయాలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చల్ల విశ్వంభర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్య క్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచు ఫయాజ్, వెంకటేష్ పాల్గొన్నారు.