kumaram bheem asifabad- భీమయ్యక్ ఆలయాన్ని నిర్మిస్తాం
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:21 PM
మండలంలోని సుంగాపూర్‌లో భీమయ్యక్ ఆలయాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గిరిజనులకు హామీ ఇచ్చారు. జాతర సందర్భంగా శినివారం ఆమె ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోలాం గిరిజన సంప్రదాయ బద్దంగా నృత్యాలు చేసి దర్భార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిర్యాణి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సుంగాపూర్‌లో భీమయ్యక్ ఆలయాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి గిరిజనులకు హామీ ఇచ్చారు. జాతర సందర్భంగా శినివారం ఆమె ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోలాం గిరిజన సంప్రదాయ బద్దంగా నృత్యాలు చేసి దర్భార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే జాతర వరకు ఆలయ నిర్మాణం చేపడుతామ న్నారు. అనంతరం ఐటీడీఏ ఏపీవో శ్యామల మాట్లాడుతూ జాతర నిర్వహణకు ఐటీడీఏ ప్రత్యేక నిధులు మంజూరయ్యే విధంగా పీవోకు వివరిస్తామన్నారు. అనంతరం క్రీడా కారులకు బహుమతులు అందజేశారు. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి):మండలంలో మంజూరైన 60 మంది లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో నిరుపేద ఆడబిడ్డ పెళ్లిళ్లకు ఇబ్బందులు పడకుండా కల్యాణలక్ష్మి పథకం ప్రవేశ పెట్టారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేష్, నాయకులు జగదీష్, శ్రీదేవి, చంద్రశేఖర్, కమల, శ్రీనివాస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సీఎం కప్ ర్యాలీని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై వెంకటేష్, జిల్లా క్రీడల అధికారి షేకు, పీఈటీ సాంబశివరావు, ఎంపీడీవోతో పాటు కార్యదర్శులు పాల్గొన్నారు.