Share News

kumaram bheem asifabad- ఒర్రెల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:07 PM

మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఉన్న ఒర్రెల సమస్యల పరిష్కారం కోసం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండలంలోని గురువారం భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన కుశ్నపల్లి ఒర్రెను పరిశీలించారు.

kumaram bheem asifabad- ఒర్రెల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం
బెజ్జూరులో కుశ్నపల్లి ఒర్రెను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే హరీశ్‌బాబు

బెజ్జూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఉన్న ఒర్రెల సమస్యల పరిష్కారం కోసం రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. మండలంలోని గురువారం భారీ వర్షాల కారణంగా ఉప్పొంగిన కుశ్నపల్లి ఒర్రెను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వర్షాకాలంలో ప్రతీ ఏటా వరదలు వచ్చినప్పుడు వాగవుతుల ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వరదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీ అనుమతుల కారణంగా వంతెనల నిర్మాణం ఆగిపోయిందని, దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి వచ్చే ఏడాదిలోగా సమస్య పరిష్కారం చేస్తామన ్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకరావాలని అధికారులకు సూచించారు. అనంతరం రేచిని గ్రామంలో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. చిన్నారుల సంక్షేమం కోసం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఏవో నాగరాజు, ఎస్సై సర్తాజ్‌పాషా, కార్యదర్శి రోజా తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 30 , 2026 | 11:07 PM