kumaram bheem asifabad- అధికారులు హాజరవకుంటే సమావేశాన్ని బహిష్కరిస్తాం
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:18 PM
మండల సమావేశాలకు అధికారులు హాజరు కాకుంటే వచ్చే మండల సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు సభ్యులు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలప్రత్యేక అధికారి, సీఈవో లక్ష్మీనారాయణ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమై గంట గడిచినా అధికారులు హాజరు కాకపోవడంపై సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గైరుహజరైతే తమసమస్యలను ఎవరికి చెప్పుకొవాలన్నారు. సమావేశాలకు మండల అధికారులు హాజరు కాకుండా తమ కిందిస్థాయి అధికారులను పంపించడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండల సమావేశాలకు అధికారులు హాజరు కాకుంటే వచ్చే మండల సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు సభ్యులు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండలప్రత్యేక అధికారి, సీఈవో లక్ష్మీనారాయణ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమై గంట గడిచినా అధికారులు హాజరు కాకపోవడంపై సభ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు గైరుహజరైతే తమసమస్యలను ఎవరికి చెప్పుకొవాలన్నారు. సమావేశాలకు మండల అధికారులు హాజరు కాకుండా తమ కిందిస్థాయి అధికారులను పంపించడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల సమావేశానికి హజరు కానీ సభ్యుల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. పలు గ్రామపంచాయతీ భవనాలకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నట్లు సర్పంచ్‌లు సంగీత, నీలకుమారిలు సభదృష్టికి తీసుకువచ్చారు. రహపల్లి ఎస్సీ కాలనీలో మీషన్ భగీరథ నీరు రావడం లేదని గత ఏడు సంవత్సరాల నుంచి విన్నవిస్తునే ఉన్నామని రహపల్లి సర్పంచ్ సుంకరి మంగ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాలలో విద్యుత్ సమస్యలు ఉన్నాయని సభ్యులు ఏఈ దృష్టికి తీసుకువచ్చారు. తాను ఇటివలనే రూరల్ ఇన్‌చార్జీగా బాధ్యతలు తీసుకున్నానని సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని ప్రజలకు అందుబాటులో ఉంటానని ఏఈ లక్ష్మీనారాయణ తెలిపారు. గుండి ఎంఎల్‌హెచ్‌పీని జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌కు ఎందుకు డిప్యూటేషన్ కల్పించారని సర్పంచ్ జాబరి రవి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కుమరంభీం ప్రాజెక్టుపై ఎన్నిరోజులు కవర్లు కప్పి ఉంచుతారని, డి3 కాలువ కింద 8 కిలోమీటర్ల మేర మరమత్తు పనులు చేపట్టడంవల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని ఏఈ సంఘవిని ప్రశ్నించారు. బాబాపూర్ గ్రామంలో 25 నుంచి 30 విద్యుత్ స్తంబాలు సక్రమంగా లేవని వాటిని సరిచేయాలని సర్పంచ్ రాజన్న విద్యుత్‌శాక ఏఈ దృష్టికి తీసుకువచ్చారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్డె అనిల్‌కుమార్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. మండల సమవేశానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ మంగ, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ ఆహ్మద్, ఎంపీడీవో శ్రీనివాస్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.