మంత్రి పర్యటనను అడ్డుకుంటాం
ABN , Publish Date - Jul 07 , 2026 | 11:37 PM
మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలతో పది రోజులుగా నిరం తరం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని నాగర్‌క ర్నూల్ జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిక్కొండ్ర శ్రీశైలం విమర్శించారు.
- జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీశైలం
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 7 (ఆంధ్రజ్యో తి) : మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో అవినీతి ఆరోపణలతో పది రోజులుగా నిరం తరం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని నాగర్‌క ర్నూల్ జడ్పీటీసీ మాజీ సభ్యుడు చిక్కొండ్ర శ్రీశైలం విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లా డుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తప్పు చేయలేదని భావిస్తే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరినా ఆయన స్పందించ లేదని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు అవి నీతి అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేం దుకు బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ నాగర్‌కర్నూల్ పర్యటన సందర్భంగా నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. బీఆర్‌ఎస్ శ్రే ణులు అధిక సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. స మావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటయ్య, బీఆర్‌ఎస్ నాయకులు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.