సమన్వయంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలి
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:27 PM
అఽధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి గ్రామాల అ భివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే వం శీకృష్ణ అన్నారు.
- మండల సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
ఉప్పునుంతల, జూలై 31 (ఆంధ్రజ్యో తి) : అఽధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి గ్రామాల అ భివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే వం శీకృష్ణ అన్నారు. శనివారం మండలం లోని రైతు వేదికలో ఎంపీడీవో వరుణ్ తేజ అధ్యక్షతన సాధారణ మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. మండ లంలోని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్య లు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతీరును, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, తాగునీటి సరఫరా వ్యవసాయ తదితర అంశా లపై శాఖలవారీగా వివరించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమ న్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో కలిసి ప్రజా సమస్యలను పరిష్కరిం చాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో త హసీల్దార్ సునీత, ఎస్‌ఐ పుట్ట మహేష్‌గౌడ్, హెచ్‌ఎం శ్రీనివాసులు, ఏవో రమేష్, ఏపీఎం బాలచంద్రయ్య, ఏపీవో పర్వతాలు, వైద్యాధి కా రి స్వప్న, సర్పంచ్‌లు భూపాల్‌రావు, జగత్‌రెడ్డి, లలిత, వెంకటేశ్వర్లు, వెంకటేశ్ పాల్గొన్నారు.