kumaram bheem asifabad- ఛత్రపతి శివాజీ ఆశయాల సాధనకు పాటుపడాలి
ABN , Publish Date - May 15 , 2026 | 10:13 PM
ఛత్రపతి శివాజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామంలో శుక్రవారం శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరె కులస్తులు శివాజీని
చింతలమానేపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఛత్రపతి శివాజీ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. చింతలమానేపల్లి మండలం కర్జవెల్లి గ్రామంలో శుక్రవారం శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరె కులస్తులు శివాజీని దైవంగా భావించి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆరెకులస్తుల అభివృద్ధి కోసం తాము పాటుపడుతామని చెప్పారు. ఓబీసీ సర్టిఫికెట్ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. మండల కేంద్రంలో ఆరెకుల కమ్యూనిటీ భవన ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. దిందా, కర్జవెల్లి గ్రామాల్లో పోడు సమస్య ఉందని అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నాని అన్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అంతకంటే ముందు గ్రామ కమిటీ సభ్యులతో కలిసి శివాజీ విగ్రహావిష్కరణ, శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. కాషాయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాష్, డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, నానయ్య, భాస్కర్, వెంకయ్య, మల్లయ్య, నానయ్య, రంగన్న, చంద్రశేఖర్, నారాయణ, గణేష్, లక్ష్మణ్, మహేష్, శ్రీను, సత్యనారాయణ, జనార్దన్, వానుపటేల్, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి
చింతలమానేపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలోని బాలాజీ అనుకోడ రైతు వేదికలో 43 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను, నలుగురికి కల్యాణలక్ష్మి, ఆరుగురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం లోపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరు బేసిమెంట్ పూర్తి చేసుకోవాలని చెప్పారు. లేని పక్షంలో మంజూరు పత్రాలు రద్దు చేసి వేరే వారికి ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ప్రజలు, లబ్ధిదారులు సహకరించాలని కోరారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేశామని త్వరలో పనులు చేపడుతామని, 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పెట్టామని దీనితో మండలంలో పూఇర్త స్థాయిలో లో ఓల్టేజీ సమస్య తీరుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ ప్రకాష్, నాయకులు మల్లయ్య, సర్పంచ్‌లు బాలు, అంకులు, శ్రీధర్, తిరుపతి, అశోక్, ఉప సర్పంచ్‌లు మురళీ, జైరాం, తిరుపతి, నాయకులు తిరుపతి, తుకారాం, రావు, సాయి, నవీన్, శంకర్, పురుషోత్తం, పోశన్న, బాలాజీ, హరికృష్ణ, తిరుపతి, సాయి తదితరులు పాల్గొన్నారు.