kumaram bheem asifabad- టీబీ ముక్త్ భారత్‌కు కృషి చేయాలి
ABN , Publish Date - Mar 24 , 2026 | 10:39 PM
టీబీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అవును మనం టీబీనీ అంతరం చేయగలం’ అన్న నిదానం మనందరిలో ఆత్మవిశ్వాసం నింపుతుందని చెప్పారు. సరైన చికిత్స ప్రభుత్వ సహకారం, ప్రజల భాగస్వామ్యంతో టీబీ ముక్త్ భారత్ సాధ్యమేనని అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): టీబీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అవును మనం టీబీనీ అంతరం చేయగలం’ అన్న నిదానం మనందరిలో ఆత్మవిశ్వాసం నింపుతుందని చెప్పారు. సరైన చికిత్స ప్రభుత్వ సహకారం, ప్రజల భాగస్వామ్యంతో టీబీ ముక్త్ భారత్ సాధ్యమేనని అన్నారు. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే స్పూటం పరీక్ష చేయించుకోవాలని సూచించారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తప్పకుండా చేతి రుమాలు వాలన్నారు. నివాస ప్రాంతాల్లో కూడా గాలి, వెలుతురు, సూర్యరశ్మి దారళంగా వచ్చేలా కిటీకీలు తెరిచి ఉంచాలని తెలిపారు. పౌష్టిక ఆహారం, పాటు, పండ్లు ఆకు కూరలు, పప్పులు తినడం వల్ల కూడా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని తెలిపారు. టీబీ రోగులను ప్రేమగా చూడాలని డీఎంహెచ్‌వో సూచించారు. వారి పట్ల వివక్ష చూపకుండా చికిత్స తీసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వినయ్, డాక్టర్ వెంకటేష్, జిల్లా సమన్వయకర్త పవన్, సూపర్‌వైర్, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి,(ఆంధ్రజ్యోతి): ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా డాక్టర్ అయేషా, డాక్టర్ రియాజ్‌ల ఆధ్వర్యంలో వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జాతీయ రహదారి వరకు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. సరైన చికిత్స ప్రభుత్వ సహకారం, ప్రజల బాగస్వామ్యంతో టీబీ ముక్త్ భారత్ సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బెజ్జూరు వైద్యాధికారులు డాక్టర్ శ్రావణ్, శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి క్షయవ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయవ్యాధికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత వైద్యం, మందులు ఉన్నాయని చెప్పారు. వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నానరు. క్షయవ్యాధి ప్రమాదకరమైనది కాదని, దాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. క్షయవ్యాధి సోకిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాల న్నారు. అనంతరం ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఈవో వెంకన్న, స్టాఫ్ నర్సులు వాణి, రజిత, సుజాత, వందన, ఎల్‌టీ రాజావర్ధన్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ధనుంజయ్, ఏఎన్‌ఎం రాంబాబు, మేఘన తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధి ప్రమాదకరమైనది కాదని వైద్యాధికారిణి అశ్విని అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రం లో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): క్షయవ్యాధి ప్రమాదకరమైనది కాదని డాక్టర్ ఉదయ్ కిరణ్ అన్నారు. మండలంలోని చోర్‌పల్లి సిర్పూర్(యు) ఆరోగ్యాకేంద్రాల్లో ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవం సంధర్బంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మధుకర్, కృపావాణి, సంతోష్‌రాజు, రంజిత్‌కుమార్, అరుణా, చంద్రకళ, స్థానిక సర్పంచ్ మర్సకోల్లా అనుసూయ జుగాదిరావు, ఉపసర్పంచ్ నీలకంఠ్ పాల్గొన్నారు.