Share News

రైతుల అభ్యున్నతికి పాటుపడాలి

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:27 PM

రైతుల అభ్యున్నతికి పాటుపడాలని మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు.

రైతుల అభ్యున్నతికి పాటుపడాలి
కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ పాలక మండలి సభ్యులను సన్మానిస్తున్న పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

- ఘనంగా కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

కొల్లాపూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : రైతుల అభ్యున్నతికి పాటుపడాలని మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అ న్నారు. కొల్లాపూర్‌, పెంట్లవెల్లి మండలాల వ్యవ సాయ మార్కెట్‌ కమిటీ ఐదో పాలకవర్గం గురు వారం కొలువుదీరింది. నూతన చైర్‌ పర్సన్‌గా పసుపుల షమీమ్‌, వైస్‌ చైర్మన్‌గా పసుపుల న రసింహతో పాటు పాలకవర్గ డైరెక్టర్లు పదవీ బా ధ్యతలు స్వీకరించారు. కొల్లాపూర్‌ మార్కెట్‌ యా ర్డు ప్రాంగణంలో కోలాహలంగా జరిగిన ఈ ప్ర మాణ స్వీకరారోత్సవానికి ముఖ్యఅతిథిగా మం త్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూ తన పాలకవర్గానికి ఆయన పు ష్పగుచ్ఛాలు అందించి శుభా కాంక్షలు తెలిపారు. సభలో మంత్రి మాట్లాడు తూ నూతన పాలకవర్గానికి దిశానిర్దేశం చేశా రు. పదవులకు వన్నె తెచ్చేలా తమ పని విధా నం ఉండాలని కొత్త పాలవర్గానికి సూచించారు. కొందరు రాజకీయ నాయకులు తనపై చేస్తున్న ఆరో పణలకు తాను చేపడుతున్న అభివృద్ధే సమాధానం చెబుతుందని మంత్రి అన్నారు.

పాలకవర్గ సభ్యులు వీరే..

కొల్లాపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ పసు పుల షమీమ్‌, వైస్‌ చైర్మన్‌ పసుపుల నరసింహ తో పాటు పాలకవర్గ సభ్యులుగా మద్దెల రాందా స్‌, తడకల జగదీశ్వర్‌ నాయుడు, పెద్దాపురం శ్రీను, పెద్దూరి లక్ష్మయ్య, నల్లవెల్లి రామస్వామి, పానుగోటి పెద్ద కృష్ణారావు, దేశావత్‌ శ్రీరాము లు, కందూరి రామచంద్రయ్య, గార్డుల మౌనిక, కృష్ణయ్య, బీఎస్‌ చాంద్‌పాషాలచే జిల్లా మార్కె ట్‌ కమిటీ అధికారి నరేంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన చైర్‌ పర్సన్‌ పసుపుల షమీమ్‌ మాట్లాడుతూ తమకు మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు మేలు చేసే అవకాశం క ల్పించడంపై వారు కృత జ్ఞతలు తెలిపారు. పా లక మండలి సభ్యులను శాలువా, పూలమాలతో మంత్రి జూపల్లి, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యోతిసత్యం, ము నిసిపల్‌ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:27 PM