Share News

రైతుకు వెన్నుదన్నుగా నిలవాలి

ABN , Publish Date - Oct 15 , 2026 | 11:15 PM

రై తుకు వెన్నుదన్నుగా నిలవాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

రైతుకు వెన్నుదన్నుగా నిలవాలి
కలాం చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, కాంగ్రెస్‌ నాయకులు

- అచ్చంపేట నూతన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం

- ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : రై తుకు వెన్నుదన్నుగా నిలవాలని నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట వ్యవసా య మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీ కార మహోత్సవ కార్యక్రమాన్ని వ్యవసాయ మా ర్కెట్‌యార్డులో గురువారం ఘనంగా నిర్వహిం చారు. ఎంపీ, అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వ్యవసా య మార్కెట్‌ కమిటీ చై ర్మన్‌గా గోపాల్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా శివగౌడ్‌, పాల క మండలి, డైరెక్టర్లు ప్ర మాణ స్వీకారం చేశారు. నూతన పాలకవర్గ సభ్యు లు తమ బాధ్యతలను స్వీక రించారు. వారు మాట్లాడుతూ రైతుల సంక్షే మం, వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధి, రైతులకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాల కల్పనకు నూతన పాల కవర్గం కృషి చేయాలని కోరారు. 150ఏళ్ల తర్వాత ఎల్‌నినో వచ్చిందని, ప్రజలు, రైతులు ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరా రు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

ఏపీజే అబ్దుల్‌ కలాంకు ఘన నివాళి

శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సే వలందించిన దివంగత అబ్దుల్‌కలాం జీవితం ప్రతీ ఒక్కరికి ఆదర్శమని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ లు అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి వారు నివాళులర్పించారు. 1931వ సంవత్సరం అక్టోబ రు 15న తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులాబిన్‌, ఆసియామ్మ దంపతులకు కలాం జన్మించారని, దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2026 | 11:15 PM