అభివృద్ధిని చూపి ఓట్లు అడగాలి...
ABN , Publish Date - Jan 31 , 2026 | 11:33 PM
చేసిన అభివృద్ధిని చూపి ఓ ట్లు అడగాలని కానీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా భయబ్రాంతుల కు గురి చేస్తూ విజయం సాధించాలనుకోవడం మూర్ఖత్వమని బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పేర్కొన్నారు.
భయబ్రాంతులకు గురి చేయడం మూర్ఖత్వం
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
చెన్నూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి) : చేసిన అభివృద్ధిని చూపి ఓ ట్లు అడగాలని కానీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా భయబ్రాంతుల కు గురి చేస్తూ విజయం సాధించాలనుకోవడం మూర్ఖత్వమని బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పేర్కొన్నారు. శనివారం చెన్నూరు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి తాను అధికారంలో ఉన్నానని స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకో వాలని వివిధ రకాల దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. రెండేళ్లలో జరిగిన అభివృద్థి ఏమిటో ప్రజలు చూస్తున్నారన్నారు. మంత్రి పాలన అస్థవ్యస్థంగా ఉందని మొన్న జరిగిన సర్పంచు ఎన్నిక ల్లో ప్రజలే బుద్ది చెప్పారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ కార్యకర్తలపై నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, హ్యూమన్ రైట్స్ కమిషన్‌లను సంప్రదించి మంత్రిపై చర్యలు తీసుకునే విధంగా ముం దుకు సాగుతామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పత నం తప్పదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.