త్యాగాలను స్మరించుకోవాలి
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:30 PM
ధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను స్మరించుకో వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉం దని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- పోలీసు అమరవీరుల దినోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష
అచ్చంపేటటౌన్, అక్టోబరు 27 (ఆం ధ్రజ్యోతి) : విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను స్మరించుకో వాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైన ఉం దని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భా గంగా మంగళవారం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో పోలీస్‌శాఖ, లయన్స్ క్లబ్ ఆధ్వర్వం లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా డివిజన్ పరిధిలోని అన్ని మండలాల పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఎమ్మెల్యే రక్తదాన శి బిరాన్ని ప్రారంభించారు. ఆయనకు డీఎస్పీ శ్రీని వాసులు, సీఐనాగరాజు పూలమొక్కతో స్వా గతం పలికారు. అనంతరం రక్తదానంలో పాలొ ్గన్న వారికి సర్టిఫికెట్లు అందజేసి అభినందించా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం అనేది మరోవ్యక్తికి ప్రాణదానమన్నారు. అవకాశం వ చ్చినప్పుడు ప్రతీ మనిషి రక్తదానం చేయాల న్నారు. కార్యక్రమం అన్ని మండలాల ఎస్‌ఐలు, విజయ్ భాస్కర్, ఇందిరమ్మ పాల్గొన్నారు.