Share News

పట్టణాభివృద్ధికి సహకరించాలి

ABN , Publish Date - Jan 13 , 2026 | 10:55 PM

అందరి సహకారంతో పట్టణాని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

పట్టణాభివృద్ధికి సహకరించాలి
అచ్చంపేట : మధురానగర్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

అచ్చంపేటటౌన్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : అందరి సహకారంతో పట్టణాని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మార్నింగ్‌వాక్‌ లో భాగంగా మధురానగర్‌ కాలనీలో పర్యటించి కాలనీవాసులను సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. త్వరలోనే డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణాల కు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభిస్తా మన్నారు. త్వరలో పార్కులకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. ప్రతీ కాలనీలో సొసైటీలను ఏ ర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్ర మం లో మునిసిపల్‌ కమిషనర్‌ ము రళి, కౌన్సిలర్‌ శివ, నాయకులు చత్రునాయక్‌, గోపాల్‌, మల్లి కార్జున్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

రోడ్డు పనుల పరిశీలన

అమ్రాబాద్‌, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలో జరుగుతు న్న రోడ్డు విస్తరణ పనులను ఎ మ్మెల్యే వంశీకృష్ణ మంగళవారం సాయంత్రం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి పరిశీలించారు. త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అమ్రాబాద్‌ సర్పంచ్‌ చిగుళ్ల కోటయ్య, ఉప సర్పంచ్‌ రాజా రాంగౌడ్‌, కాంగ్రెస్‌ నాయకులు బాలింగంగౌడ్‌, కుందా మల్లికార్జున్‌, రేణయ్య, సంతోష్‌, మక్బూ ల్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 13 , 2026 | 10:55 PM