Share News

ఓటరు జాబితా ప్రక్షాళనకు సహకరించాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:13 PM

ఓటరు జాబితాల ఖచ్చితత్వం, పారదర్శకత కోసం చేప డుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని క ల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి కోరారు.

ఓటరు జాబితా ప్రక్షాళనకు సహకరించాలి
కల్వకుర్తిలో 2కే రన్‌ అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో జనార్దన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఇబ్రహీం, నాయకులు

- కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి

- ఎస్‌ఐఆర్‌పై అవగాహన ర్యాలీ

కల్వకుర్తి/ తిమ్మాజిపేట/ తాడూరు/ పదర/ ఊర్కొండ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితాల ఖచ్చితత్వం, పారదర్శకత కోసం చేప డుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమానికి ప్రతీ ఒక్కరు సహకరించాలని క ల్వకుర్తి ఆర్డీవో జనార్దన్‌రెడ్డి కోరారు. బుధవారం ఉదయం తహసీల్దార్‌ కార్యాలయం నుంచి హై దరాబాద్‌ చౌరస్తా వరకు నిర్వహించిన 2కేరన్‌ అవగాహనలో తహసీల్దార్‌, ఇతర అధికారులు, నాయకులతో కలిసి ఆర్డీవో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 25వ తేదీ నుంచి ఇంటిం టికీ ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ చేపడతా రని తెలిపారు. ప్రజలు తమ కుటుంబ వివరా లను పూర్తిగా, సరైన విధంగా నమోదు చేసి సంబంధిత బీఎల్‌వోలకు అందించాలని సూచిం చారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు కావడంతో పాటు అనర్హుల పేర్ల తొలగింపునకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని అన్నారు. బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు సమన్వయంతో పని చేసి ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గ దర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదే శించారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయాలని సూచించారు. అనంతరం క ల్వకుర్తి తహసీల్దార్‌ బీఎల్‌ వోలకు కిట్లను పంపిణీ చే శారు. కార్యక్రమంలో కల్వకు ర్తి తహసీల్దార్‌ ఇబ్రహీం, క ల్వకుర్తి మునిసిపాలిటీ కమి షనర్‌ మహమ్మద్‌ షేక్‌, కల్వ కుర్తి సీఐ భీమ్‌కుమార్‌, ఎం ఈవో శంకర్‌నాయక్‌, హాస్పిటల్‌ సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ శివరాం, అగ్రికల్చర్‌ ఏవో సురే ష్‌, ఎక్సైజ్‌ సీఐ వెంకటరెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

అర్హులను ఓటర్‌ జాబితాలో చేర్చాలి

తిమ్మాజిపేటలో తహసీల్దార్‌ జయంతి ఆధ్వ ర్యంలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన ర్యాలీ నిర్వహిం చారు. గ్రామాల్లో అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్పించాలని తహసీల్దార్‌ సూచించా రు. డిప్యూటీ తహసీల్దార్‌ జ్యోతి, రెవెన్యూ గిర్దా వర్‌ అనురాధ, అదనపు గిర్దావర్‌ జ్యోతి, గ్రామ పరిపాలన అధికారులు ఉదయ్‌ కుమార్‌, రామ చంద్రయ్య,శేఖర్‌, అధ్యాపకుడువెంకన్న ఉన్నారు.

బీఎల్‌వోలు అప్రమత్తంగా వ్యవహరించాలి

తాడూరులో తహసీల్దార్‌ రామకృష్ణయ్య ఆ ధ్వర్యంలో ఆర్‌ఐలు, జీపీవోలతో సమావేశం నిర్వ హించారు. అన్ని గ్రామాల్లో గురువారం నుంచి ఎస్‌ఐఆర్‌ అమలవుతున్న నేపథ్యంలో బీఎల్‌వో లు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ సూచించారు. డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాసు లు, ఆర్‌ఐలు, జీపీవోలు ఉన్నారు.

తప్పుడు వివరాలు ఇస్తే జరిమానా

పదరలో తహసీల్దార్‌ సురేష్‌బాబు ఆధ్వర్యం లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటు హక్కు ఉన్న ప్రతీ ఒక్క రు ఎన్యుమరేషన్‌ ఫామ్‌లో సరైన వివరాలు నిం పి బీఎల్‌వోలకు అందజేయాలన్నారు. తప్పుడు వివరాలు ఇస్తే జరిమానాలు ఉంటాయన్నారు.

నేటి నుంచి సర్‌ ఫారాల పంపిణీ

ఊర్కొండ మండలంలో నేటి నుంచి ప్రతీ గ్రా మంలో ఎస్‌ఐఆర్‌ పారాల పంపిణీ ఉంటుందని తహసీల్దార్‌ యూసుఫ్‌ అలీ తెలిపారు. ఎన్యు మరేషన్‌ ఫారలను ప్రజలు పారదర్శకంగా నింపి ఇవ్వాలని సూచించారు. ఏమైనా అనుమా నాలు ఉంటే నివృత్తి కోసం తహసీల్దార్‌ కార్యాల యంలో సంప్రదించాలని సూచించారు.

Updated Date - Jun 24 , 2026 | 11:13 PM