వానాకాలం సాగుకు సన్నద్ధం కావాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:10 PM
వానాకాలం వ్యవసాయ సాగుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జా జు అన్నారు. శనివారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్ట ర్, అదనపు కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
మంచిర్యాల కలెక్టరేట్, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : వానాకాలం వ్యవసాయ సాగుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జా జు అన్నారు. శనివారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్ట ర్, అదనపు కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలో 138.49 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్ధేశించామన్నారు. 99.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నకలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. జూలై నెలకు అవసర మైన ఎరువులను ముందస్తుగా నిల్వ ఉంచాలని, యూరియా అక్రమ రవా ణా, అధిక ధరల విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక తనికీలు నిర్వహించాల న్నారు. రైతు రిజిస్ర్టేషన్ పూర్తి చేయాలన్నారు. అలాగే వర్షాకాలం దృష్య్టా అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, శుక్ర వారం డ్రైడే నిర్వహించాలన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ వా నాకాలం సాగుకు రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందు బా టులో ఉంచడంతో పాటు ప్రత్యామ్నాయ పంట సాగులో అవసరమైన మెళ కువలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య, జి ల్లా వ్యవసాయాధికారి సురేఖ, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీపీవో వెం కటేశ్వర్‌రావు, జిల్లామాధ్యమిక అధికారి అంజయ్య పాల్గొన్నారు.