రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Feb 26 , 2026 | 11:46 PM
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భ వన సమావేశ మందిరంలో అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్ భ వన సమావేశ మందిరంలో అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జి ల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను పటిష్టంగా అమలు చేయా లన్నారు. మున్సిపల్ పరిధిలోని రోడ్లపై చెత్త, ఆటంకాలను వెంటనే తొ లగించాలని, ట్రాఫిక్ పోలీసు విభాగం రోడ్లపై అనధికార వాహనాల ని లుపుదల, నిబంధనల ఉల్లంఘనల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నా రు. జాతీయ రహదారులపై రంబుల్‌స్ర్టిప్స్, లైటింగ్, జాగ్రత్త సూచిక బో ర్డులను ఏర్పాటు చేయాలన్నారు. పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహ నాలపై చర్యలు తీసుకోవాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పని సరిచేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై కేజీవీల్స్, ట్రాక్టర్‌కేజీవీల్స్ వినియోగాన్ని నిలిపివేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కూరగాయల వ్యాపారులు ర హదారులపై విక్రయాలు జరగకుండా ప్రత్యేక మార్కెట్ స్థలాన్ని కేటా యించాలన్నారు. డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వారి లైసెన్స్‌లను రద్దు చేయాలని, కల్వర్టుల వద్ద సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జాతీయరహదారులు, రవాణా, ఆర్టీసీ,విద్యుత్, పంచా యతీరాజ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.