పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:36 PM
పర్యావరణ ప రిరక్షణ అనేది ప్రభుత్వాల బా ధ్యత మాత్రమే కాదని, ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి భాగస్వాములు కావా లని కల్వకుర్తి మునిసిపల్ చైర్ పర్సన్ బృంగి రత్నమాల పిలుపు నిచ్చారు.
- మునిసిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల
కల్వకుర్తి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ ప రిరక్షణ అనేది ప్రభుత్వాల బా ధ్యత మాత్రమే కాదని, ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి భాగస్వాములు కావా లని కల్వకుర్తి మునిసిపల్ చైర్ పర్సన్ బృంగి రత్నమాల పిలుపు నిచ్చారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పా టు భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతా వరణాన్ని అందించవచ్చని ఆమె పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణంలో ప్రతీ ఇంటికి మొక్కల పం పిణీ కార్యక్రమాన్ని మునిసిపల్ కమిషనర్ మ హమ్మద్ షేక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్‌పర్సన్ హాజరై ప్రజలకు మొ క్కలను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా ప్రతీఒక్కరు తీసు కోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో చిన్న ప్రయత్నం కూడా భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తుందని, అందుకే ప్రతీఒక్కరు మొక్కలు నాటివాటి సంరక్షణలో భాగస్వాము లు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముని సిపల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఆర్.శివ, మహిళలు, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.