kumaram bheem asifabad- రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:16 PM
రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కలెక్టర్ హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సూచనల మేరకు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్డాఉతూ దానాల్లో కెల్లా రక్తదానం చాలా గొప్పదన్నారు.
ఆసిఫాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కలెక్టర్ హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సూచనల మేరకు కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్డాఉతూ దానాల్లో కెల్లా రక్తదానం చాలా గొప్పదన్నారు. ఎందరినో ప్రాణాలు నిలబెట్టిన వారమవుతామన్నారు. ఉద్యోగులు అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరంలో ఎత్తు, బరువు, బీపీ, బీఆర్‌బీఎస్, ఈసీజీ, కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతీ ఒక్కరు పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవా లని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దాత్తరావు, డీఎంహెచ్‌వో సీతారాం, డీపీవో భిక్షపతిగౌడ్, మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.
ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదు
జిల్లాలో గృహ అవసరాలకు ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని వినియోగదారులు ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నిలువలను అందుబాటులో ఉంచినట్లు, ఎల్‌పీజీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సరైన విధంగా సిలిండర్లు ఉపయోగించేటట్లు చూడడానికి ప్రత్యేక మానిటరింగ్ కమిటీ నియమించినట్లు తెలిపారు. ప్రజలు ఎవరు కూడా ముందస్తు బుక్కింగ్‌లు అవసరం లేదని వినియోగదారుల అవసరాలకు సరిపడ నిలువలు ఉన్నట్లు తెలిపారు. బుకింగ్‌లు నిలువలపై రోజు వారీ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని, అటువంటివి ఎక్కడైనా సంభవిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని అన్నానరు. దీని కోసం ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి ఆధ్వర్యంలో కొనసాగుతుందని 85005844365 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.
జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు అవసరమైన కార్యాచరణ రుపొందించుకొవాలని రాష్ట్ర ముఖ్య ఎలకొ్ట్రరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎలకొ్ట్రరల్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అదికారులతో శుక్రవారంవీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయలన్నారు. పెండిం గ్‌లో ఉన్న ఫారం 6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్ లెవల్ ఏజెంట్ జాబితా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కోసం జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బూత్‌లెవల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరించే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.