Share News

మాదిగ మహాసభ విజయవంతానికి కృషి చేయాలి

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:52 PM

రాష్ట్రంలో ఈ నెల 27న నిర్వహించే మాదిగ హక్కుల దండోరా ఆవిర్భావ బహిరంగ సభను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌ మాదిగ , గౌరవాధ్యక్షుడు రామకృష్ణ మాదిగలు తెలిపారు.

మాదిగ మహాసభ విజయవంతానికి కృషి చేయాలి
మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌ మాదిగ

మందమర్రిటౌన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఈ నెల 27న నిర్వహించే మాదిగ హక్కుల దండోరా ఆవిర్భావ బహిరంగ సభను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌ మాదిగ , గౌరవాధ్యక్షుడు రామకృష్ణ మాదిగలు తెలిపారు. గురువారం వేములవాడలోని మున్నూరుకాపు సంఘం భవనంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు పాల్గొని మా ట్లాడారు. ప్రజా ప్రభుత్వం దృష్టికి మాదిగలకు సంబంధించిన ప్రధాన సమస్యలను విన్నవించామన్నారు. పెండింగ్‌లో ఉన్నలెదర్‌ పార్కులను ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని తీర్మాణించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు రవి, జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 11:52 PM