Share News

కాలుష్య నివారణకు సమష్టిగా కృషి చేయాలి

ABN , Publish Date - Aug 03 , 2026 | 10:51 PM

ప్రతీ ఒక్కరు నాటిన మొక్కలను సంరక్షించి కాలుష్యనివారణకు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం వన మ హోత్సవంలో భాగంగా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి రాముని చెరు వు వద్ద మొక్కలు నాటారు.

కాలుష్య నివారణకు సమష్టిగా కృషి చేయాలి

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు

మంచిర్యాలక్రైం, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు నాటిన మొక్కలను సంరక్షించి కాలుష్యనివారణకు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం వన మ హోత్సవంలో భాగంగా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి రాముని చెరు వు వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, విద్యా సంస్థల్లో అవ కాశం ఉన్న ప్రతిచోట మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. గతం లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రాంతం అడవుల జిల్లాగా ప్రసిద్దిచెం దిందని ప్రస్తుతం అటవిశాఖ తగ్గిందన్నారు. తిరిగి పెంపొందిం చేందుకు అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పర్యావరణాన్ని కలిసికట్టుగా కాపాడుకుందాం...

జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌...

పర్యావరణాన్ని కలిసికట్టుగా కాపాడుకుందామని నాటిని మొక్కలు సంరక్షించుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నాటిని మొక్కలను కాపాడుకునేందుకు ప్రత్యేక శ్రద్ద చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మేయర్‌ ధర్ని మధూకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అన్వేష్‌, డిప్యూటి మేయర్‌ సల్ల రమ్య, నగరపాలక సంస్థ అధ్యక్షులు తూముల నరేశ్‌, కార్పొరేటర్లు హరిక్రిష్ణ, నాయకులు తిరుపతి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే సంక్షేమం

కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సంక్షేమం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. సోమవారం ఐబీ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌్‌ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనిమియా బాధితులకు నెలవారి సామాజిక భద్రత ఫించన్లు మంజూరు చేసిన సందర్భంగా ఆయన జీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సోసైటీ సభ్యులు, మేయర్‌ ధర్ని మధూకర్‌, డిప్యూటి మేయర్‌ రమ్య, కార్పొరేటర్‌ తూముల నరేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భానేష్‌, కార్పొరేటర్లు హరిక్రిష్ణ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2026 | 10:51 PM