మున్నూరు కాపు అభివృద్ధికి కలిసి పనిచేయాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 10:16 PM
మున్నూరు కాపు సామాజిక అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి పని చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తంరావు పటేల్ అ న్నారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తంరావు పటేల్
మంచిర్యాల క్రైం, జులై 19 (ఆంధ్రజ్యోతి) : మున్నూరు కాపు సామాజిక అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి పని చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురుషోత్తంరావు పటేల్ అ న్నారు. మంచిర్యాల పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సంక్షేమ సంఘం సమావేశానికి జిల్లా అధ్య క్షుడు చిట్ల సత్యనారయణ అధ్యక్షత వహించగా ఆయన ము ఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హించిన జనగణనలో మున్నూరు కాపుల సంఖ్యను తక్కు వగా చూపెట్టారన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, పట్టణ, గ్రామ స్థాయిలో ప్రత్యేక సర్వే నిర్వహించి మున్నూరు కాపుల సంఖ్యను నివేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నా రు. దీని కోసం, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కమిటీ లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా పార్టీలకు అతీతంగ నాయకులు అందరూ ఒకే వేదికలో కలు సుకోవడం హర్షనీయమన్నారు. సంఘం బలోపేతానికి ప్రతీ ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని, పార్టీలు, వ్యక్తిగత విభేదా లకు అతీతంగా మున్నూరుకాపు అభివృద్దే లక్ష్యంగా కలిసి నడవాలని సూచించారు. ప్రభుత్వం జనగణనలో మున్నూరు కాపులను 13 లక్షలుగా చూపించిందని, రాష్ట్రంలో 40 లక్షలు గా ఉన్న మున్నూరు కాపుల సంఖ్యను నివేదిక ద్వారా చూ పేందుకు ఆయా జిల్లాల ఇన్‌చార్జిలు చొరవ తీసుకొని ము న్నూరు కాపు జనగణన విజయంవంతం చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని అందరూ కలిసి కట్టుగా సహాయ సహకారాలు అందించి పూర్తి చేయాలని పి లుపునిచ్చారు. అనంతరం మున్నూరు కాపు కార్పొరేషన్ చై ర్మన్ బొమ్మ శ్రీరామచక్రవర్తి పటేల్ మాట్లాడుతూ ప్రతి జి ల్లాలో మున్నూరు కాపుల కోసం ఆత్మగౌరవ భవనాలు ని ర్మించాలని, హైదరాబాదులో రాష్ట్ర స్థాయి భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ ధర్ని మధూకర్, రాష్ట్ర కార్యదర్శి, అసిఫాబాద్ ఇన్‌చార్జీ గాదె సత్యం, జిల్లా ఇన్‌చార్జి ఇందూరి తిరుపతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబిలపు శ్రీనివాస్, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ తూ ముల నరేష్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేష్, నాయకులు గొలిశెట్టి రాజన్న, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.