Share News

kumaram bheem asifabad- అడవుల సంరక్షణకు బాధ్యతగా పాటుపడాలి

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:01 PM

ప్రజలు అడవుల సంరక్షణకు బాధ్యతగా పాటుపడాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బెజ్జూరు మండలంలోని ఇందుర్‌గాం గ్రామంలో సలుగుపల్లి, జైహింద్‌పూర్‌, సుస్మీర్‌, పెంచికలపేట మండలంలోని ఆగర్‌గూడ, గుండెపల్లి అటవీ ప్రాంత గ్రామాల ప్రజలకు అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అటవీ సంరక్షణాధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌తో కలిసి గ్యాస్‌ రీఫిలింగ్‌, నాన్‌స్టిక్‌ స్టవ్‌లు, సోలార్‌ లైట్లు ఆదివారం అందజేశారు.

kumaram bheem asifabad- అడవుల సంరక్షణకు బాధ్యతగా పాటుపడాలి
బెజ్జూరులో ఎలక్ట్రిక్‌ స్టవ్‌లు పంపిణీ చేస్తున్న ఎమ్మెలే హరీష్‌బాబు, జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌

బెజ్జూరు/పెంచికలపేట, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): ప్రజలు అడవుల సంరక్షణకు బాధ్యతగా పాటుపడాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. బెజ్జూరు మండలంలోని ఇందుర్‌గాం గ్రామంలో సలుగుపల్లి, జైహింద్‌పూర్‌, సుస్మీర్‌, పెంచికలపేట మండలంలోని ఆగర్‌గూడ, గుండెపల్లి అటవీ ప్రాంత గ్రామాల ప్రజలకు అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అటవీ సంరక్షణాధికారి నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌తో కలిసి గ్యాస్‌ రీఫిలింగ్‌, నాన్‌స్టిక్‌ స్టవ్‌లు, సోలార్‌ లైట్లు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంత గ్రామాల ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా అటవీశాఖ పెట్టుకుందని ఈ సందర్భంగా వారిని అభినందించారు. అడవులతోనే మానవాళికి మనుగడ ఉంటుందని అడవుల నరికి వేత, వన్యప్రాణుల వేట చేయవద్దని సూచించారు. అటవీ శాఖ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని అడవుల రక్షణ కోసం ప్రజలు తమ వంతుగా కృషి చేయాలన్నారు. పోగు భూముల సమస్యల త్వరలోనే పరిష్కార మార్గానికి చూపెడతామని పేర్కొన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరయ్యాయని, ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మరో 20 ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా అటవీ అధికారి నీజర్‌కుమార్‌ టిబ్రెవాల్‌ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అటవీ ప్రాంతం టేకు చెట్టకు నిలయంగా మారిందని వాటిని కాపాడేందుకు ప్రజలు కృషి చేయాల్సిన అవసరం ఉందని, అటవీ ప్రాంతంలో నీళ్లు లేచి నోట బోర్లు వేసి వసతి కల్పిస్తామని తెలిపారు. వంట చెరుకుపై ప్రజలు ఆధార పడకుండా ఉండేందుకు గ్యాస్‌లు ఇస్తున్నామని ఇది అడవుల రక్షణకు ఉపయోగుతుందన్నారు. కార్యక్రమంలో ఐఎస్‌ఎఫ్‌ శిక్షణ అధికారి భార్గవ్‌ కుమార్‌, ఎప్‌డీఓ అప్పయ్య, రేంజ్‌ అధికారి ముసవీర్‌, డిప్యూటీ రేంజ్‌ అధికారి శ్రావణ్‌కుమార్‌, ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, సెక్షన్‌ అధికారి సోఫియా బేగం, బీట్‌ అధికారులు వెంకటేష్‌, మురళీ, సత్యనారాయణ, వెంకటేశం, సాగరిక, అనిల్‌, సర్పంచ్‌ లావణ్య, రాజు, రాజేశ్వరి, సులోచన, భాస్కర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2026 | 11:01 PM