kumaram bheem asifabad-కుమరం భీం ఆశయాల సాధనకు పాటుపడాలి
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:50 PM
కుమరం భీం ఆశయాల సాధనకు పాటుపడాలని పలువురు నాయకులు అన్నారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాడిన వీరుడు కుమరం భీం వర్థంతి వేడుకలు ఆదివారం సిర్పూరు(టి) ఎస్టీ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మా ట్లాడుతూ భీం ఆశయాల సాధన ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు.
సిర్పూరు(టి), నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆశయాల సాధనకు పాటుపడాలని పలువురు నాయకులు అన్నారు. ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాడిన వీరుడు కుమరం భీం వర్థంతి వేడుకలు ఆదివారం సిర్పూరు(టి) ఎస్టీ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మా ట్లాడుతూ భీం ఆశయాల సాధన ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఆదివాసీల హక్కుల పరి రక్షణ కోసం భీం చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సిడం మాణిక్, గంట గోపాల్, సర్పం అర్జున్, గెడెం నగేష్, యుగేందర్, టేకం భిక్షపతి, భీంరావు, ఎం వెంకటేష్, జంగు, మహేష్, ఓదెలు, సిడం భీం రావు తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కుమరం భీం చౌరసా ్తలోని కుమరం భీం విగ్రహానికి ఆదివారం పలువురు నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి, నాయకుడు మాంతయ్య మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ కుమరం భీం ఆశయాలను కొనసాగిం చాలని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహానీయుడు కుమురం భీం అని కొనియాడారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమంలో నాయకుడు బాపు తదితరులు పాల్గొన్నారు.