Share News

kumaram bheem asifabad- జ్యోతిబాఫూలే ఆశయాల సాధనకు పాటుపడాలి

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:03 PM

జ్యోతిబాఫూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలో శనివారం నిర్వహించిన జ్యోతిబాఫూలే వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్మే మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావుపూలే అణగారిన వర్గాల కోసం ఎనలేని సేవలు చేశారని కొనియాడారు.

kumaram bheem asifabad- జ్యోతిబాఫూలే ఆశయాల సాధనకు పాటుపడాలి
చింతలమానేపల్లిలో ఫూలే చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు

చింతలమానేపల్లి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): జ్యోతిబాఫూలే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండలంలో శనివారం నిర్వహించిన జ్యోతిబాఫూలే వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్మే మాట్లాడారు. మహాత్మ జ్యోతిరావుపూలే అణగారిన వర్గాల కోసం ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. డబ్బా, బారెగూడ, ధరంపల్లి గ్రామాల్లో పలువురు నాయకులు జ్యోతిబాఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ గుర్లే శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నికోడే బాపురావు, మాలి సంఘం మండల అధ్యక్షుడు సందీప్‌, యాదవ సంఘం నాయకులు అంగోల చిలుకయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో జ్యోతిబాఫూలే వర్ధంతిని నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జ్యోతిబా పూలే విగ్రహనికి ఏఎంసీ చైర్‌పర్సన్‌ మంగ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్‌ రమేశ్‌ పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు రాపర్తి మురళీ ఆధ్వర్యంలో నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అలాగే తెలంగాణ రక్షణసేన పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కిరిమిళ్ల వినోద్‌చారి ఆధ్వర్యంలో నాయకులు ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి మాజీ ఎంపి మీడియం బాపురావు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలబ్‌బాబులు ఫూలమాల వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): జ్యోతిబాఫూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుప డ్డారని మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యాంరావు అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో జ్యోతిబాఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో మాలి సంక్షేమ సంఘం జనరల్‌ సెక్రటరి వసాకే హన్మంతు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు రవీందర్‌, రామయ్య, రవి, శ్రీనివాస్‌, శ్రీహరి, పురుషోత్తం, మోతీరావు, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జ్యోతిబాఫూలే వర్ధంతిని నిర్వహించారు. కౌటాలలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని జ్యోతిబాఫూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమం లో జీవన్‌ధార వలంటరీ బ్లడ్‌ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జ్యోతిబాఫూలే సావిత్రిబాయి చిత్రపటాలకు పలువురు నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు వశాక భీంరావు, వశాక తిరుపతి, గౌత్రే దుర్గయ్య, నరేందర్‌, శ్యాంరావు తదితరులు పాల్గొన్నారు.

సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జ్యోతిబాఫూలే వర్ధంతిని నిర్వహించారు. మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అదిత జ్యోతిబాఫూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా వికాసం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు సుర్పం అనిత, మాలి సంఘం అధ్యక్షుడు నానాజీ, ఉపాధ్యక్షుడు మెంగాజీ, ప్రధాన కార్యదర్శి వడాయి రవి, డివిజన్‌ అధ్యక్షుడు పరమేష్‌, మేడ్‌పల్లి ఉప సర్పంచి చౌదరి సంతోష్‌, నాగరావు, శంకర్‌, గోపాల్‌, ఓదెలుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జ్యోతిబాఫూలే వర్ధంతిని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సహకార చైర్మన్‌ హన్ను పటేల్‌ శివనూర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ లు కొడప ప్రకాష్‌, జాదవ్‌ శ్రావణ్‌, మాంగ్‌ సమాజం జిల్లా అధ్యక్షుడు మవాలె దత్త, సభ్యులు దశరథ్‌ అడె, పవార్‌ శివాజీ పెట్కులె, రాందాస్‌ జంక్టె, సంజీవ్‌ లెండుగురెచ, జైరాం చౌదరి విలాస్‌ జంక్టె, వాడ్గురె ప్రకాష్‌, హరి యోగేశ్వర్‌ పెట్కులె, నాయకులు , మేస్రాం అం బాజీ, గాయక్‌వాడ్‌ సతీష్‌, మవాలె దత్త కాంబ్లే నాగోరావ్‌, గోవింద్‌ పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా జ్యోతిబాఫూలే వర్ధంతిని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అంబేద్కర్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌, మాలీ సంక్షేమ సంఘం డివిజన్‌ అధ్యక్షుడు గుర్నులే మెంగాజీ, ఉపసర్పంచ్‌ దీపక్‌ ముండె, అంబెద్కర్‌ యువజన సంఘం నాయకులు దుర్గం శ్యాంరావు, రాజేశ్వర్‌, విలాస్‌, దుర్గం హంసరాజ్‌, విఠ్టల్‌, భీంరావు, బుద్దాజీ, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మాలి సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా ఫూలే వర్దంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మాలి సంఘం కులస్తులు మండల కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీగా వెళ్లి జ్యోతిబాఫూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహిళా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి అదిత జ్యోతిబాఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాలి సంఘం మండల అధ్యక్షుడు ఆదే అశోక్‌, యువజన సంఘం అధ్యక్షులు సురేష్‌, నాయకులు తిరుపతి, శంకర్‌, మోహన్‌, వార్డు సభ్యుడు తిరుపతి, కాంగ్రెస్‌ నాయకులు జావీద్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:03 PM