Share News

kumaram bheem asifabad- అంబేద్కర్‌ ఆశయాల సాధనకు పాటుపడాలి

ABN , Publish Date - Oct 27 , 2026 | 10:22 PM

అంబేద్కర్‌ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కాంబ్లె అనిల్‌, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో గత జూలై 29 ఆషాడ పౌర్ణమి నుంచి అశ్విని పౌర్ణమి సోమవారం వరకు గౌతమ బుద్ధుడు, అంబీద్కర్‌ జీవిత చరిత్రలపై నిర్వహించిన గ్రంథ పఠన ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడారు.

kumaram bheem asifabad- అంబేద్కర్‌ ఆశయాల సాధనకు పాటుపడాలి
గ్రంథ పఠన చేసిన బౌద్ద ఉపాసకులను సన్మానిస్తున్న నాయకులు

వాంకిడి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): అంబేద్కర్‌ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కాంబ్లె అనిల్‌, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో గత జూలై 29 ఆషాడ పౌర్ణమి నుంచి అశ్విని పౌర్ణమి సోమవారం వరకు గౌతమ బుద్ధుడు, అంబీద్కర్‌ జీవిత చరిత్రలపై నిర్వహించిన గ్రంథ పఠన ముగింపు కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మూడు నెలలు గ్రంథ పఠనం చేసిన ఖోబ్రగడే కూమార్‌, ఉపాసక్‌ పాండు జాడేను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబీడ్కర్‌, రమాబాయి, గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రలు చదవడం ద్వారా వారి ఆశయాలు, సమాజ అభ్యున్నతి కోసం చేసిన కృషి, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతీ ఒక్కరూ తెలుపుకోవాలని సూచించారు. అంబేద్కర్‌ చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో అసమానతలను తొలగించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. చదువుతోనే సమాజంలో చైతన్యం పెరుగుతుందని, విద్య ద్వారానే సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవుతాయని చెప్పారు. మూడు నెలల పాటు గ్రంథ పఠన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటుచేసుకోని అంబేద్కర్‌ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎల్‌ఎల్‌ఎస్‌ సంస్థ చైర్మన్‌ అవినాష్‌, మాజీ జడ్పీటీసీ అజయ్‌కుమార్‌, సర్పంచ్‌ చునార్‌కార్‌ సతీష్‌, ఉపసర్పంచ్‌ దీపక్‌ ముండే, అంబేద్కర్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌, సమతా సైనిక్‌ దళ్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుర్గం సందీప్‌, అంబెద్కర్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు దుర్గం దుర్గాజీ, నాయకులు విజయ్‌, దుర్గం శ్యాంరావు, రాజేశ్వర్‌, రమేష్‌, పితాంబర్‌, ప్రతాప్‌, రోషన్‌, దుర్గం ప్రశాంత్‌, శ్యాంరావు దుర్గె, బౌద్ద ఉపాసకులు, రమాబాయి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2026 | 10:22 PM